AKHANDA PRADHAMA SARGA SUNDARAKANDA PATHANAM ON JULY 7 FOR WORLD HEALTH AND PROSPERITY- TTD ADDITIONAL EO _ జూలై 7న సుంద‌రకాండ ప్ర‌థ‌మ సర్గ శ్లోక అఖండ పారాయ‌ణం : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 6 Jul. 20: Akhanda Pradhama Sarga Sundarakanda Pathanam will be conducted at the Nada Neerajanam platform on July 7 seeking global health and prosperity.

Speaking about the unique Pathanam, the Additional EO said Srivari darshan had resumed at Tirumala from June 8 onwards with all necessary corona restrictions.

He said the Sundarakanda Pathanam was taken up by the TTD for relieving humanity from pandemic COVID-19.

The devotees recited the slokas and were imparted the significance and meaning with 10 slokas per day and the Pradhama Sarga Sundarakanda Pathanam concluded on Monday.

As per the legend of Ramayana penned by Sage Valmiki in Pradhama Sarga that Hanumanta had surged from Mahendragiri and reached Lanka passing all demon armies. 

He said all arrangements were made for Pathanam of 211 shlokas on Monday. It is believed that such Pathanam will please Lord Hanumanta, His Master Sri Ramachandra and Sri Venkateswara an avatar of Sri Ramachandra will save humanity from the Covid-19 pandemic.

The Additional EO said on Tuesday from 7 is Akhanda Pradhama Sarga Sundarakanda Pathanam will be conducted for 70-80 minutes at a rate of 3 shlokas per minutes. He appealed to all devotees to perform the Pathanam as all shlokas penned by sage Valmiki are sacred verses and the pdf of all slokas is available in SVBC website, www.svbcttd.com

He said as many as 6.5 crore devotees globally including one crore devotees in both Telugu states are following the Pathanam which is live telecasted by the SVBC every day. He said the positive vibes that emerge when all these millions of voices recite the powerful slokas across the globe will definitely provide strength to everyone to tide over the difficulties especially from Coronavirus.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

జూలై 7న సుంద‌రకాండ ప్ర‌థ‌మ సర్గ శ్లోక అఖండ పారాయ‌ణం : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి
 
తిరుమల, 2020 జూలై 06: తిరుమ‌ల నాదనీరాజ‌నం వేదిక‌పై జూలై 7 మంగ‌ళ‌వారం ఉద‌యం 7 గంట‌ల నుండి సుంద‌రకాండ ప్ర‌థ‌మ సర్గ సంపూర్ణంగా 211 శ్లోకాల‌ అఖండ పారాయ‌ణం నిర్వ‌హించ‌నున్నామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. సోమ‌వారం జరిగిన సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. 
      
ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ జూన్ 8వ తేదీ నుండి తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నామ‌ని, క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో టిటిడి సిబ్బంది జాగ్ర‌త్త చ‌ర్య‌లు పాటిస్తూ భ‌క్తుల‌కు సేవ‌లందిస్తున్నార‌ని తెలిపారు. క‌రోనా వైర‌స్‌ను ప్ర‌పంచం నుండి పార‌దోలేందుకు సుంద‌ర‌కాండ పారాయ‌ణం చేప‌డుతున్నామని, శ్లోకాల‌ను భ‌క్తుల‌తో ప‌లికించి అర్థ తాత్ప‌ర్యం, ఫ‌లితాన్ని వివ‌రిస్తున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు రోజుకు 10 చొప్పున శ్లోకాల‌ను ప‌ఠించామ‌ని, సుంద‌ర‌కాండ ప్ర‌థ‌మ స‌ర్గ సోమ‌వారానికి పూర్త‌యిందని తెలిపారు. వాల్మీకి మ‌హ‌ర్షి రామాయ‌ణంలోని సుంద‌ర‌కాండ ప్ర‌థ‌మ స‌ర్గలో సూచించిన ప్ర‌కారం హ‌నుమంతుడు మ‌హేంద్ర‌గిరి ప‌ర్వ‌తం నుండి లంఘించి సముద్రాన్ని దాటుకుంటూ కార్య‌దీక్ష‌తో అవిశ్రాంతంగా ప్ర‌యాణించి లంక‌కు చేరుకున్నాడ‌ని చెప్పారు. అదేవిధంగా, ప్ర‌థ‌మ‌స‌ర్గ‌లోని 211 శ్లోకాల‌ను అవిశ్రాంతంగా ప‌ఠించేందుకు మంగ‌ళ‌వారం ఏర్పాట్లు చేశామ‌న్నారు. ఇలా చేయ‌డం వ‌ల్ల హ‌నుమంతుడు సంతోషిస్తాడని, త‌ద్వారా శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి అవ‌తార‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌రుడు ప్ర‌స‌న్న‌మై క‌రోనా వ్యాధిని మాన‌వాళి నుండి దూరం చేస్తాడ‌ని తెలిపారు.
 
మంగ‌ళ‌వారం య‌థావిధిగా ఉద‌యం 7 గంట‌ల‌కు అఖండ పారాయ‌ణం మొద‌ల‌వుతుంద‌ని, ఒక్కో నిమిషానికి 3 శ్లోకాల చొప్పున 70 నుండి 80 నిమిషాల పాటు ఈ కార్య‌క్ర‌మం నిరంత‌రాయంగా కొన‌సాగుతుంద‌ని అద‌న‌పు ఈవో వెల్ల‌డించారు. వాల్మీకి మ‌హ‌ర్షి రచించిన ఈ శ్లోకాల‌న్నీ మంత్రాలేన‌ని, భ‌క్తులంద‌రూ వీటిని ప‌ఠించాల‌ని కోరారు. ఇప్ప‌టికే ప్ర‌తిరోజూ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఒక కోటి మంది, ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 6.5 కోట్ల మంది ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ఈ మంత్రాల‌ను ప‌ఠిస్తున్నార‌ని వివ‌రించారు. ఇంత‌పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు మంత్రాల‌ను ప‌ఠించ‌డం ద్వారా, ఆ శ‌బ్ద త‌రంగాలు హ‌నుమంతుడిని చేరి త‌ప్ప‌క ప్ర‌స‌న్న‌మ‌వుతాడ‌ని చెప్పారు. 211 శ్లోకాలను భ‌క్తులంద‌రూ డౌన్‌లోడ్ చేసుకుని ప‌ఠించేందుకు వీలుగా ఎస్వీబీసీ వెబ్‌సైట్(www.svbcttd.com)‌లో అందుబాటులో ఉంచామ‌న్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.