ALAMELUMANGA BRAHMOTSAVA VAIBHAVAM-CURTAIN RAISER TO SRI PAT ANNUAL FETE_ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వ్యాసం

Tiruchanur, 11 Nov. 17: The annual Navahnika Karthika Brahmotsavams in the famous temple of Goddess Sri Padmavathi Devi is all set commence from November 15 which will last up to November 23 showcasing her divine splendour and grandeur.

MAHALAKSHMI INCARNATION

On the lines of Tirumala Srivari Brahmotsavams, Lord Brahma, the Creator had the privilege of having performed the first festival for Goddess and hence named after him as “Brahmotsavams”.
It is believed that Goddess Sri Mahalakshmi incarnated on the auspicious day of Friday on Panchami Tithi in Vijaya LAGNA Uttaradhada Nakshatram during Suklapaksha in the month of Karthika in a 1000-petal lotus flower as 16-year beautiful girl in Padma Sarovaram, the holy temple tank.

“PADMA” AS PREFIX FOR HER DIVINE NAMES

Since she appeared in the golden lotus she is revered by various names, as Padmalaye, Padmahasta, Padmapriye, Padmini, Padmasini, Padmavathi, Padmaja and many more sacred names with Padma as prefix.

“SARVA SWATANTRA LAKSHMI” VAHANA SEVA VAIBHAVAM

In Tirumala Lord Sri Malayappa takes ride along with His Consorts on Kalpavriksha, Sarvabhupala, Mutyapupandiri, Swarna Ratham and Rathotsavam while Goddess Padmavathi Devi as “Sarva Swatanta Lakshmi” takes ride on all vahanams all alone displaying her elegance.
It will be a visual spectacle f​​​​​​or the devotees to watch the divine Mother taking pleasure ride on various vahanams with royalty showcasing her grandeur during these nine days.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వ్యాసం

సిరులతల్లి శ్రీ అలమేలుమంగ అవతరణ

తిరుపతి, 2017 నవంబరు 11: సిరులతల్లి శ్రీ మహాలక్ష్మి తిరుచానూరులో శ్రీ అలమేలుమంగగా కార్తికమాసంలో శుక్ల పంచమీ శుక్రవారం, ఉత్తరాషాడా నక్షత్రం, విజయలగ్నంలో శ్రీనివాసుని ఎదుట పద్మసరోవరంలో సహస్రదాళాలు కలిగిన బంగారుపద్మంలో అవతరించింది.

బంగారు పద్మంలో పద్మాసనియై పద్మహస్తగా పద్మమూలాలంకృత అయిన నిత్య యౌవన శోభితురాలైన శ్రీ మహాలక్ష్మి, పదహారేళ్ల నవయువతిగా అవతరించింది. బంగారు వర్ణంలో ప్రకాశిస్తున్న ‘పద్మావతి’ని బ్రహ్మేంద్రాది దేవతలు, భృగునారద, తుంబురాది మహర్షులు, ముక్కోటి దేవతలు ఎన్నోవిధాలుగా కీర్తిస్తూ, స్తుతించారు. ఆనాటి నుండి శ్రీ పద్మావతి అమ్మవారు వెలసిన తిరుచానూరు క్షేత్రంలో ”స్వతంత్ర వీరలక్ష్మీ”గా ప్రసిద్ధి పొందారు.

శ్రీ వేంకటేశ్వరస్వామివారు సుదీర్ఘ కాలం తర్వాత తన ఎదుట ప్రత్యక్షమైన శ్రీమహాలక్ష్మిని చూసి ఆనందపడుతూ తన మెడలోని కల్హారమాలను ఆమె కంఠంలో వేసి, ఆలింగనం చేసుకున్నాడు. అనంతరం అందరికి వరాలను ప్రసాదించే అలమేలుమంగ అదృశ్యమై శ్రీనివాసుని వక్ష:స్థలంలో ”వ్యూహలక్ష్మి”గా ఆవిర్భవించింది. శ్రీవారి వక్షస్థలంలో అమ్మవారు వేంచేసివున్నందువల్ల స్వామివారు ‘శ్రీనివాసుడు’గా ప్రసిద్ధి పొందాడు.

శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన కార్తీకశుక్ల పంచమినాటిని పురస్కరించుకుని ప్రతిఏటా కలియుగాంతం వరకు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపబడతాయని శ్రీపద్మావతి సమేత శ్రీనివాసుడు వరమిచ్చారు. అందువల్లే ఆనాటినుండి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఉత్సవాలు ఎంత వైభవంగా జరుగుతునవో అలాగే అమ్మవారికి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

ఈ దివ్య క్షేత్రంలో శ్రీనివాసుడు లేకుండానే మహారాజ్ఞి అయిన పద్మావతి అమ్మవారికి పాంచరాత్రాగమ పద్ధతిలో ఉత్సవాలు, ఊరేగింపులు జరుగునట్లు బ్రహ్మదేవుడు ఏర్పాట్లు చేసినట్లు పురాణ ప్రాశస్త్యి. అంతేగాక పద్మాసరోవరంలో పద్మావతి అమ్మవారు అవతరించిన నాటికి అవబృథస్నానం (పచమితీర్థం)తో ముగియనున్నట్లు ఉత్సవాలు నిర్వహిస్తారు. పంచమితీర్థం రోజున తిరుమల క్షేత్రం నుండి శ్రీవారి కంఠంలోని పూలమాల, పసుపుకుంకుమలు, ఆభరణాలు, చీరసారె, పిండివంటలు, తిరుచానూరులోని అలమేలుమంగమ్మకు కానుకగా సమర్పించడం ఆనవాయితీ.

సాక్షత్తు శ్రీనివాసుడు ఏడుకొండలు దిగి వచ్చి తపస్సు చేసిన దివ్యస్థలమైన తిరుచానూరులో బ్రహ్మాది దేవతల కోరిక మేరకు శ్రీ పద్మావతి అమ్మవారు ఈ క్షేత్రంలో ‘అర్చామూర్తి’గా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే అమ్మవారిని దర్శించుకుని, అర్చిస్తారో వారికి పోగొట్టుకున్న సిరిసంపదలు, పదవులు తిరిగి పొందడమేగాక, ధర్మ అర్థ కామ మోక్షలు, పురుషార్థాలు సిద్ధిస్తాయని స్థల పురాణ ప్రాశస్త్యి.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు అమ్మవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనవివ్వనున్నారు. నవంబరు 15న ధ్వజారోహణంతో ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవాలు నవంబరు 19న గజవాహనం, నవంబరు 20న గరుడవాహనం, నవంబరు 22న రథోత్సవము, నవంబరు 23వ తేదీ పంచమితీర్థంతో ముగుస్తాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

​​​​​​​​​​​​