ALARMELMANGA GRACES DEVOTEES AS MUVVA GOPALA KRISHNA_ పెద్దశేష వాహనంపై మువ్వ‌గోపాలుని అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి వాహ‌న‌సేవ‌లో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఇఎస్ఎల్‌.న‌ర‌సింహ‌న్‌

Tiruchanoor, 5 Dec. 18: On the second day morning during ongoing nine-day brahmotsavams in Tiruchanoor on Wednesday, processional deity of Sri Padmavathi Devi blessed Her devotees as Muvva Gopala Krishna.

The cultural troupes in front of Pedda Sesha Vahanam added colour to the procession on the bright sunny day.

GOVERNOR TAKES PART

The honourable Governor of twin Telugu states Sri ESL Narasimhan along with his spouse Smt Vimala Narasimhan took part in the Pedda Sesha Vahana Seva.

JEOs Sri KS Sreenivasa Raju, Sri P Bhaskar, CVSO Sri Gopinath Jetti, temple DyEO Smt Jhansi Rani and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

పెద్దశేష వాహనంపై మువ్వ‌గోపాలుని అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి వాహ‌న‌సేవ‌లో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఇఎస్ఎల్‌.న‌ర‌సింహ‌న్‌

తిరుపతి, 2018 డిసెంబ‌రు 05: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన బుధ‌వారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై మువ్వ‌గోపాలుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఇఎస్ఎల్‌.న‌ర‌సింహ‌న్ దంప‌తులు వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు. అనంత‌రం అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా గౌ.. గ‌వ‌ర్న‌ర్ మీడియాతో మాట్లాడుతూ పెద్ద‌శేష వాహనంతోపాటు ఆల‌యంలో అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

శ్రీపద్మావతి మాతకు కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది.

ఈ సందర్భంగా తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ పెద్దశేష వాహనంపై అమ్మవారిని దర్శిస్తే సమస్త దోషాలు తొలగి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. భక్తులు సంతృప్తికరంగా అమ్మవారి వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. డిసెంబ‌రు 8న గ‌జ‌వాహ‌నం, డిసెంబ‌రు 12న పంచ‌మీతీర్థానికి విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉన్నందున విస్తృతంగా ఏర్పాట్లు చేశామ‌న్నారు.

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ్యంగార్‌, తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అర్బ‌న్ ఎస్‌పి శ్రీ అన్బురాజ‌న్‌, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.