ALARMELUMANGA MESMERIZES AS MOHINI _ ప‌ల్ల‌కీపై మోహినీ అలంకారంలో శ్రీ అల‌మేలుమంగ‌

TIRUPATI, 14 NOVEMBER 2023: On the fifth day morning as a part of the ongoing annual Karthika brahmotsavams at Tiruchanoor on Tuesday, Sri Padmavathi Devi as Mohini on the finely decked Pallaki on Tuesday.

 

Both the Pontiffs of Tirumala, Chandragiri MLA Dr Bhaskar Reddy, JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan, VGO Sri Bali Reddy, AEO Sri Ramesh, Superintendent Smt Srivani and others were also present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ప‌ల్ల‌కీపై మోహినీ అలంకారంలో శ్రీ అల‌మేలుమంగ‌

తిరుపతి, 2023 నవంబరు 14: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం అమ్మవారు మోహినీ అలంకారంలో ప‌ల్ల‌కీలో ఊరేగుతూ భక్తులను అనుగ్ర‌హించారు.

అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది.

ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు వ‌సంతోత్స‌వం నిర్వ‌హిస్తారు.

గ‌జ వాహ‌నం

బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు విశేష‌మైన గ‌జ వాహ‌నంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.

వాహనసేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, విఎస్వో శ్రీ బాలి రెడ్డి, ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.