FEAST OF DEVOTIONAL SANGEET AT SRI PAT BTU_ ”అలమేలుమంగ హరి అంతరంగ…” ఆస్థానమండపంలో భక్తిసాగరంలో ముంచెత్తిన అన్నమయ్య సంకీర్తనలు

Tirupati, 16 November 2017: Lovers of devotional sangeet and bhakti cults of temple town of Tirupati were enthralled today with the feast of devotional music rendered by artistes of HDPP, Annamacharya project, Dasa Sahitya Project,Alwar Divya Prabandam and SV Music and Dance college at the Asthana mandapam of Sri PAT, Tiruchanoor.

The programs conducted by the artistes for two and half hours included Aluvelu manga hari antaranga and various Annamacharya sankeertans, Veda parayanams by students of SV Music and Dance college, religious discourse by Chennai based Dr C Nammalwar and bhakti sangeet by Smt Rupasri Rajagopalan of Chennai and Smt K Shivaratnam team sankeertan during the Unjal seva.

In the same manner at the Mahati kalasketram bhakti sangeet was rendered by SV Music and Dance college Principal Sri A Sabari Girish, Bharata natyam by E Nagasai Meghana team. At the Annamacharya Kala kendram Sri G Abhilash team performed Bhakti sangeet along with dance program Smt Vanishri Ravi Shankar.

Finally the Tiruvur based Smt Goda Nagamani team rendered bhakti music at the Shilparamam auditorium on the Tiruchanoor road.


ISSUED BY TTDs,PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

”అలమేలుమంగ హరి అంతరంగ…” ఆస్థానమండపంలో భక్తిసాగరంలో ముంచెత్తిన అన్నమయ్య సంకీర్తనలు

నవంబరు 16, తిరుపతి, 2017: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూెత్సవాల సందర్భంగా గురువారం సాయంత్రం తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి, టిటిడి ఉద్యోగి శ్రీసి.బాలసుబ్రమణ్యం కలిసి ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తాయి. బ్రహ్మూెత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, ఎస్వీ సంగీత న త్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్క తిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.

ఇందులో భాగంగా తిరుచానూరులోని ఆస్థాన మండపంలో సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు అన్నమయ్య విన్నపాలు కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. ‘చూడరమ్మ సతులారా….’, ‘ఏమని పొగడుదమే….’, ‘క్షీరాబ్ది కన్యకకు….’, ‘కులుకగ నడవరు….’, ‘విచ్చేయవమ్మా…’ తదితర సంకీర్తనలను టిటిడి అధికారులు రాగభావయుక్తంగా ఆలపించారు.

ఇదిలా ఉండగా ఆస్థానమండపంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు ఎస్‌.వి.సంగీత కళాశాల అధ్యాపకులతో మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు ధర్మగిరిలోని శ్రీవేంకటేశ్వర వేదపాఠశాల ఆధ్వర్యంలో వేద పారాయణం నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు చెన్నైకి చెందిన ఆచార్య సి.నమ్మాళ్వార్‌ ధార్మికోపన్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీమతి రూపశ్రీ రాజగోపాలన్‌ బృందం భక్తి సంగీతం, రాత్రి 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో శ్రీమతి కె.శివరత్నం బృందం సంకీర్తనాలాపన చేపట్టారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి 7.30 గం||ల వరకు తిరుపతిలోని ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శ్రీ ఎ.శబరిగిరీష్‌ బృందం గాత్ర సంగీతం, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఇ.నాగసాయి మేఘన బృందం భరతనాట్య కార్యక్రమం, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీ జి.అభిలాష్‌ బ ందం భక్తి సంగీతం, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీమతి వాణిశ్రీ రవిశంకర్‌ బ ందం న త్య ప్రదర్శన ఇవ్వనున్నారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరువూరుకు చెందిన శ్రీమతి గోధ నాగమణి బృందం భక్తి సంగీత కార్యక్రమం జరుగనుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.