ALL SET FOR MAHA DEEPOTSAVAM AT VIZAG- SVBC CEO _ విశాఖలో కార్తీక మహాదీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తి : ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్
Tirupati,13, November 2022: SVBC CEO Sri Shanmugha Kumar said on Sunday that all arrangements were made for the grand Karthika Maha Deepotsavam at Visakhapatnam in collaboration with the Maha Deepotsavam committee.
Addressing a media conference at Kalyana Mandapam in MVP colony, TTD SVBC CEO said the celestial fete will be held at the Mata Ammavari temple on Ramakrishna beach at 5.30 pm in which the Pontiff of Sri Sarada Peetham Sri Sri Swaroopananda Saraswati Swamiji will give blessing address.
He said both TTD Chairman Sri YV Subba Reddy and TTD EO Sri AV Dharma Reddy will participate. Besides parayanams of Vishnu Sahasranama and Sri Lakshmi Astottara Shata Namavali cultural -programs like classical dances and Annamacharya sankeetans will be held.
Donors Sri Rajesh, Himanshu Prasad, TTDSE-2 Sri Jagadeeswar Reddy, PRO Dr T Ravi, DFO Sri Srinivas and VGO Sri Manohar were present.
విశాఖలో కార్తీక మహాదీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తి : ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్
తిరుపతి, 2022 నవంబరు 13: టిటిడి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్, విశాఖపట్నం కార్తీక మహా దీపోత్సవం కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జరుగనున్న కార్తీక మహాదీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్ తెలిపారు. విశాఖ నగరంలోని ఎంవిపి కాలనీలో గల టిటిడి కళ్యాణ మండపంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.
.
ఈ సందర్భంగా సిఈవో మాట్లాడుతూ సోమవారం సాయంత్రం 5.30 గంటలకు రామకృష్ణ బీచ్ కాళీ మాత అమ్మవారి గుడి ఎదురుగా సాగర తీరాన అంగరంగ వైభవంగా కార్తీక మహా దీపోత్సవం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారు మంగళాశాసనాలు అందిస్తారని వెల్లడించారు. టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి పాల్గొంటారని తెలిపారు. విష్ణుసహస్రనామం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు పారాయణం చేస్తారని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ ఏబి.బాలకొండల రావు బృందంతో నృత్యం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తనల ఆలాపన జరుగుతాయన్నారు.
వేదిక పనులు పరిశీలన
అంతకుముందు టిటిడి ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం రామకృష్ణ బీచ్ వద్ద గల దీపోత్సవం వేదిక పనులను పరిశీలించారు. ఆర్డీవో శ్రీ హుస్సేన్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
మీడియా సమావేశంలో దాతలు శ్రీ రాజేష్, శ్రీ హిమాంశుప్రసాద్, టిటిడి ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, పిఆర్ఓ డా.టి.రవి, డిఇ శ్రీ రవిశంకర్ రెడ్డి, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, విజివో శ్రీ మనోహర్ పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.