ALL THE DISPLAYS IN THE MEGA EXPO ARE ARCHAIC AND INFORMATIVE TO PILGRIMS-TTD EO_ శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు మీడియా సెంటర్‌ ద్వారా భక్తులకు బ్రహ్మూెత్సవాల విశేషాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్

Tirumala, 23 September 2017: Complimenting the display by various departments in the mega exhibition at Kalyana Vedika, the TTD EO Sri Anil Kumar Singhal said that they are not only excellent but very informative to the pilgrims.

The mega exhibition in connection with annual srivari brahmotsavams was inaugurated by TTD EO along with Tirumala JEO Sri KS Sreenivasa Raju and CVSO Sri A Ravikrishna on Saturday.

After taking a whirl wind visit to the mega exhibition, the EO speaking to media persons, appreciated the works of Garden wing, museum, art by SV Deaf and Dumb school children, Ayur, forest and PR wing photo exhibition. The EO said, the themes carved by the garden wing including the Lava-Kusa episode and Sethu Nirmana in Ramayana, Lakshmi Devi in vegetables, Narasimhavatara in Sand Art and many more interesting mythological themes which not only attract pilgrims of all ages but enlightens them on these epic stories. Similarly the rare pictures displayed by museum, the photos of past and present of Tirumala by PR department are noteworthy works”, he added.

The EO also said that every day 20-25 thousand pilgrims visit the exhibitions and in the nine days. Every year all the departments are putting efforts to do their bit one level up and it is a welcome”, he added.

MEDIA CENTRE INAUGURATED

Earlier the EO also inaugurated media centre in Rambhageecha 2. Speaking on this occasion the EO said, the nine day annual fete will commence from today with Dhwajaroahanam in the evening. The Garuda flag will be hoisted on the temple pillar amidst chanting of vedic mantras by temple priests. The honourable CM Sri N Chandrababu Naidu will present the silk vastrams today and he will be in the temple activity between 7:30pm and 9pm.”, he added.

The EO also said, TTD has made elaborate arrangements for the media in Rambhageecha 2 by installing high speed computers, wi-fi network etc. for instant dissemination of information.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD,TIRUPATI

2017 శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలు మీడియా సెంటర్‌ ద్వారా భక్తులకు బ్రహ్మూెత్సవాల విశేషాలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సెప్టెంబర్‌ 22, తిరుమల 2017: శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల వైభవాన్ని, ఇతర విశేషాలను మీడియా సెంటర్‌ ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు చేరవేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియా ప్రతినిధులను కోరారు. బ్రహ్మూెత్సవాల మొదటిరోజైన శనివారం సాయంత్రం తిరుమలలోని రాంభగీచా-2 విశ్రాంతిగ హంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్‌ను తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణతో కలిసి ఈవో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బ్రహ్మూెత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం అన్ని విభాగాల ఆధ్వర్యంలో విస్త తంగా ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. టిటిడి చేపట్టిన ఏర్పాట్లు, సౌకర్యాల గురించి పత్రికలు, ఛానళ్లలో ఎక్కువగా ప్రచారం చేయాలని, తద్వారా ఎక్కువమంది భక్తులు సద్వినియోగం చేసుకుంటారని అన్నారు. మీడియా సెంటర్‌లో భోజన సదుపాయంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, ఫ్యాక్స్‌, టెలిఫోన్‌ వసతి కల్పించామని, మీడియా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతిరోజూ మీడియా సెంటర్‌లో వివిధ విభాగాల అధికారులు మీడియా సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. టిటిడి ఏర్పాట్లపై సూచనలు, సలహాలు అందించాలని, తప్పక పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపడతామని చెప్పారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సహాయ ప్రజాసంబంధాల అధికారిణి కుమారి పి.నీలిమ, సూపరింటెండెంట్‌ శ్రీ జయగోపాలకృష్ణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

కల్యాణవేదిక వద్ద ప్రదర్శనశాలలను ప్రారంభించిన టిటిడి ఈవో

శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాల సందర్భంగా తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ఏర్పాటుచేసిన పలు ప్రదర్శనశాలలను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ప్రారంభించారు. తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌, టిటిడి ప్రచురణల ప్రదర్శన, విక్రయం, ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఫలపుష్ప ప్రదర్శన, ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసి ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, ఎస్వీ మ్యూజియం ప్రదర్శన, శ్రీవేంకటేశ్వర శిల్పకళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిల్పకళా ప్రదర్శనలను ప్రారంభించినట్టు తెలిపారు. ఎస్వీ బధిరోన్నత పాఠశాల విద్యార్థుల చిత్రలేఖనం ప్రత్యేక ఆకర్షణగా ఉందన్నారు. ఈసారి వినూత్నంగా ప్రదర్శనలు ఏర్పాటుచేశామని, భక్తులు తిలకించి తరించాలని కోరారు. రోజుకు 25 వేల మంది వరకు భక్తులు ఈ ప్రదర్శనలను తిలకిస్తారని, మరింత ఎక్కువ మంది తిలకించేలా ప్రచారం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రదర్శనశాలలను ఏర్పాటుచేసిన ఆయా విభాగాల అధికారులను ఈవో అభినందించారు.

ప్రత్యేక ఆకర్షణగా శ్రీ ఉగ్రనరసింహుని సైకత శిల్పం:

కల్యాణవేదిక వద్ద ఏర్పాటుచేసిన శ్రీ ఉగ్ర నరసింహస్వామివారి సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మైసూరుకు చెందిన గౌరి, నీలాంబరి అనే యువతులు ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు. వీరు నాలుగేళ్లుగా బ్రహ్మూెత్సవాల సమయంలో సైకత శిల్పాలను రూపొందిస్తున్నారు. శ్రీ ఉగ్ర నరసింహస్వామివారి సైకత శిల్పం తయారీకి మూడున్నర ట్రక్కుల ఇసుకను వినియోగించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి, ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.