ALL TTD SUB-TEMPLES CELEBRATE UGADI IN A BIG WAY _ టిటిడి అనుబంధ ఆలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలు
TIRUPATI, 02 APRIL 2022; All the local temples of TTD observed Sri Subhakrutnama Ugadi in a big way on Saturday.
In Sri Kodanda Rama Swamy, Sri Govinda Raja Swamy, etc. the Ugadi fete was observed with spiritual fervour.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి అనుబంధ ఆలయాల్లో ఘనంగా ఉగాది వేడుకలు
తిరుపతి, 2022 ఏప్రిల్ 02: టిటిడి పరిధిలోని తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో శనివారం శ్రీ శుభకృత్‌నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీకోదండరామాలయంలో, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో :
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు నుంచి పుష్పపల్లకీలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 7.30 గంటల వరకు పుష్పపల్లకి జరుగుతుంది.
రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో జెఈఓ శ్రీమతి సదా భార్గవి పాల్గొన్నారు.
అదేవిధంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 7 నుండి 7.45 గంటల వరకు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 నుండి 5.30 గంటల వరకు ఆస్థానం చేపట్టారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో :
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం చేపట్టారు.
శ్రీ కోదండరామాలయంలో :
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ స్వామివారు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేశారు.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో :
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో ఆయా ఆలయాల అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.