ALLOTMENT OF ACCOMMODATION THROUGH TOKEN SYSTEM IN TIRUMALA FROM JULY 12_ జూలై 12 నుండి తిరుమలలో టోకెన్‌ విధానం ద్వారా గదుల కేటాయింపు

Tirumala, 11 Jul. 17: With a view to avoid long waiting hours by the pilgrims in the serpentine queues for accommodation, TTD has tossed a new idea keeping in view the pilgrim comfort by introducing new “Token” system for room allotment, which will come into force from July 12 on wards.

TTD has set up 10 counters for registration and 7 counters for allotment in CRO and one counter each for registration and allotment in MBC-34 in this new system.

As per the new system, the registration and allotment process for availing accommodation for the pilgrims involves a few modalities:

* Pilgrims has to register their name with Aadhaar card besides finger print will also be captured along with valid mobile number.

* Pilgrims are provided two tariff options to choose for registration with A-Category comprising rooms tariff ranging between Rs.50-Rs.250 and B-Category including rooms with ariff between Rs.500 to Rs.1000

* This registration process will be done in two slots at 6am and 2pm.

* After the registration process, a token will be issued which contains registration number, name and mobile number of the pilgrim along with expected time of allotment besides sending SMS to the pilgrim regarding registration confirmation.

* Rooms will be allotted to the pilgrim based on the registration sequence and choice of tariff whenever the room vacancy arises.

* Pilgrims should invariably avail the rooms within 30 minutes from the time of allotment or else rooms will get automatically cancelled and will be allotted to the immediate pilgrim in the sequence.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూలై 12 నుండి తిరుమలలో టోకెన్‌ విధానం ద్వారా గదుల కేటాయింపు

తిరుమల, 2017 జూలై 11: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు గదుల కోసం ఎక్కువ సేపు వేచి ఉండకుండా చూసేందుకు, గదుల కేటాయింపులో మరింత పారదర్శకత పెంచేందుకు జులై 12వ తేదీ నుండి నూతనంగా టోకెన్‌ మంజూరు విధానాన్ని టిటిడి అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం సిఆర్‌వో కార్యాలయంలో 10 కౌంటర్లు, ఎంబిసి-34 వద్ద ఒక కౌంటర్‌ను ఏర్పాటుచేశారు. ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు రెండు స్లాట్లలో గదుల కేటాయింపునకు భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ కౌంటర్ల వద్ద ఆధార్‌ నంబరు ద్వారా భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. భక్తులు వేలిముద్ర వేసి, మొబైల్‌ నంబరును తెలియజేయాలి. ఎ కేటగిరీలో రూ.50/- నుంచి రూ.250/- వరకు అద్దె గల గదులు, బి కేటగిరీలో రూ.500/- నుంచి 1000/- వరకు అద్దె గల గదులు ఉంటాయి. భక్తులు గదుల అద్దె కేటగిరీని తెలపాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ పూర్తయిన తరువాత టోకెన్‌ జారీ అవుతుంది.

ఈ టోకెన్‌లో నమోదు సంఖ్య, భక్తుడి పేరు, మొబైల్‌ నంబరు, గది మంజూరు చేసేందుకు పట్టే సమయం తదితర వివరాలు ఉంటాయి. గది మంజూరైన తరువాత సంబంధిత సమాచారాన్ని భక్తుల సెల్‌ నంబరుకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తారు. అరగంటలోపు భక్తులు అలాట్‌మెంట్‌ కౌంటర్లకు వెళ్లి గదులు పొందాల్సి ఉంటుంది. గదుల అలాట్‌మెంట్‌ కోసం సిఆర్‌వోలో ఏడు కౌంటర్లు, ఎంబిసి-34 వద్ద ఒక కౌంటరు ఏర్పాటుచేశారు. ఇక్కడ గదుల కేటాయింపు సమాచారాన్ని తెలిపేందుకు డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటుచేశారు. అరగంటలోపు గదులు పొందనిపక్షంలో ఆ తరువాత సీరియల్‌ నంబరు గల భక్తులకు కేటాయిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.