AMBEDKAR WAS THE ARCHITECT OF SOCIAL INDIA-TIRUPATI JEO_ అణగారిన వర్గాల ఆత్మబంధువు డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ :టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 14 April 2018: Dr Bhim Rao Ambedkar was not only the visionary but architect of social India, said Tirupati JEO Sri P Bhaskar.

Speaking on the occasion of 127th Birth Anniversary of Dr BR Ambedkar in TTD administrative building quadrangle, the JEO said that all through his life Dr. Ambedkar faced social discrimination since he was born in a underprivileged class. He struggled for the upliftment of the weaker sections of society and raised his voice for social justice and equality. He became the chairman of the Drafting Committee and drafted the Constitution and is rightly called the “Founding Father of Indian Constitution”, he added.

Key note address was delivered by Smt G Sridevi, President, Telugu Bashodyama Samithi , Tirupati who described Dr BR Ambedkar not only the Architect of Indian Constitution but Ambedkar Philosophy has influenced even the world intellectuals, she added.

CVSO Sri A Ravi Krishna and other officers, staff members were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

అణగారిన వర్గాల ఆత్మబంధువు డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ :టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2018 ఏప్రిల్‌ 14: అణగారిన వర్గాల ఆత్మ బంధువు డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ భారతదేశంలో కుల వ్యవస్థను నిర్మూలించి అందరికి సమాన అవకాశాలు కల్పించిన మహానుభావుడని, దళితులు, వెనుకబడిన వర్గాలు, స్త్రీలకు కూడా ఉన్నత అవకాశాలు కల్పించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ 127వ జయంతిని శనివారం ఉదయం టిటిడి పరిపాలనా భవనంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితులలో కూడా అట్టడుగు స్థాయి నుండి భారత రాజ్యాంగ నిర్మాతగా ఎదిగిన అంబేద్కర్‌ను భారతీయులందరూ ఆదర్శంగా భావించాలన్నారు. ఆయనకు అన్ని శాస్త్రాల్లో విస్తృతమైన పరిజ్ఞానం ఉండేదని తెలిపారు. హైందవ సమాజం ఎల్లప్పుడూ సర్వసమానత్వాన్నే బోధిస్తుందని, ఎలాంటి అసమానతలు లేని సమాజం కోసం ఉద్యమించిన మహానాయకుడని జెఈవో వివరించారు.

అణగారిన వర్గాల ఎదుగుదలకు విద్య సరైన ఆయుధమని భావించి అందుకు అవసరమైన చట్టాలను తీసుకువచ్చినట్లు తెలిపారు. మన ఆలోచన విధానం మారిన నాడే అంబేద్కర్‌ ఆశయాలు సిద్ధిస్తాయని తెలిపారు. అంబేద్కర్‌ కృషి వల్లనే సగటు భారతీయుడు నేడు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అనుభవించగలుగుతున్నారని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు.

ముఖ్య ఉపన్యాసకులు తిరుపతికి చెందిన తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షురాలు ప్రసంగిస్తూ అంబేద్కర్‌ ఇంతటి మహనీయుడు కావడం వెనక సమాజంలోని అన్ని వర్గాల వారి సహకారం ఉందన్నారు. కష్టపడేతత్వం ఉంటే
ఎవరైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు. భారతదేశ ప్రజలకు ఆనుగుణంగా రాజ్యాంగాన్ని నిర్మించారని తెలిపారు. అంబేద్కర్‌ రచనలను చదివితే ఒక దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రగతికి అవసరమయ్యే అన్ని అంశాలను
తెలుసుకోవచ్చన్నారు.

దళితులు విద్యనభ్యసించి చైతన్య వంతులైనప్పుడే సమాజంలో అంతరాలు తొలగిపోతాయని తెలియజేశారు. ఆయన స్ఫూర్తితో జీవితాన్ని అభివృద్ధిచేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమసమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. దళిత, గిరిజనులను గౌరవిస్తూ టిటిడి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు.

అనంతరం పలువురు టిటిడి ఉద్యోగులు ప్రసంగించారు. టిటిడి సహాయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

అంతకుముందు టిటిడి తిరుపతి జెఈవో శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి, డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ పటానికి పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో సివిఎస్వో ఆకే.రవికృష్ణ, డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ తాళ్ళురి ఆంజనేయులు, యూనియన్‌ నాయకులు, ఇతర అధికార ప్రముఖులు, టిటిడి ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.