AMRUTHOTSAVAM RALLY BY STUDENTS OF TTD SCHOOL AND COLLEGES _ టిటిడి ఆధ్వ‌ర్యంలో విద్యార్థుల‌తో ఘ‌నంగా ర్యాలి

Tirupati, 04 July 2008: As part of TTD Amruthotsavam a huge rally is conducted with Ten Thousand students of TTD and other Institutions of TTD. The Chairman Sri B.Karunakara Reddy has started the rally at S.V.University Grounds at 10 AM on Friday. The students have divided into 3 groups.

The first group made procession from university stadium, Balaji Colony, M.R.Palli circle, AIR Bypass Road, Annamayya Circle, Srinivasa Kalyanamandapam, and ended at S.G.S.Arts College.

The second group started from university ground, Balaji Colony, Town club circle, Ramakrishna Deluxe, Old maternity hospital road, V.V.Mahal road, Municipal Corporation and ended at TUDA Grounds.

The third batch of students started from university grounds thro, Balaji colony, NTR Circle, Prakasham Road, Gandhi road, Bandla Street, jayashyam theatre and ended at Srinivasam complex.

TTD Executive Officer Sri K.V.Ramanachary, TTDs Spl Officer Sri A.V.Dharma Reddy, C.V&S.O Sri B.V.Ramana Kumar, Addl C.V&S.O Sri Shiva Kumar Reddy, DEO Ms Swarajya Lakshmi, college lecturers and school teachers also took part in the procession.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

 

టిటిడి ఆధ్వ‌ర్యంలో విద్యార్థుల‌తో ఘ‌నంగా ర్యాలి

తిరుపతి జూలై-4, 2008: తిరుమల తిరుపతి దేవస్థానముల అమృతోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం తిరుపతిలో విద్యార్థినీ విద్యార్థులచే బారీ ర్యాలి నిర్వహించారు.

ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం 10గం||లకు స్థానిక ఎస్‌.వి.యూనివర్శిటీ గ్రౌండు నుండి తితిదే, ఇతర విద్యాసంస్థలలోని పాఠశాల, కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీభూమన కరుణాకరరెడ్డి ఈ ర్యాలీని ప్రారంభించారు.

ఈ ర్యాలీ తిరుపతి పట్టణంలో మూడు రూట్లలలో విద్యార్థులు పాల్గొన్నారు. మొదటి రూట్‌ యూనివర్శిటీ స్టేడియం, బాలాజీకాలనీ, యూనివర్శిటీ క్యాంపస్‌ స్కూల్‌రోడ్డు, యం.ఆర్‌.పల్లి, జు|ష్ట్ర బైపాస్‌రోడ్డు, అన్నమయ్యసర్కిల్‌, శంకరంబాడి సర్కిల్‌, శ్రీనివాసకళ్యాణమండపం మీదుగా శ్రీగోవిందరాజ ఆర్ట్సు కళాశాల చేరుకున్నారు. రెండవ రూట్‌లో యూనివర్శిటీ స్టేడియం, బాలాజీకాలనీ, టౌన్‌క్లబ్‌, రామకృష్ణ డీలక్స్‌, పాత మొటర్నిటి ఆసుపత్రి రోడ్డు, వి.వి.మహల్‌ రోడ్డు, మున్సిఫల్‌ కార్పోరేషన్‌ ఆఫీసు, మీదుగా ఇందిరామైదానం చేరుకున్నారు. అదే విధంగా మూడవ రూట్‌ యూనివర్శిటీస్టేడియం, బాలాజీకాలనీ, యన్‌.టి.ఆర్‌ సర్కిల్‌, ప్రకాశం రోడ్డు, గాంధీ రోడ్డు, బండ్ల వీధి, జయశ్యాం థియేటర్‌ రోడ్డు మీదుగా శ్రీనివాసం చేరుకున్నారు.

 ఈ ర్యాలీ నందు విద్యార్థినీ, విద్యార్థులు అధ్యాపకులతో పాటు తితిదే ఇ.ఓ శ్రీకె.వి.రమణాచారి, ప్రత్యేక అధికారి శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి, ముఖ్య భద్రతాధికారి శ్రీ రమణాకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.