ANANTA PADMANABHA VRATAM IN TIRUMALA _ సెప్టెంబరు 9న తిరుమలలో అనంతపద్మనాభ వ్రతం

TIRUMALA, 08 SEPTEMBER 2022: In connection with Ananta Padmanabha Vratam in Tirumala on September 9, Chakra Snanam will be observed.

 

After the second bell, Sri Sudarshana Chakrattalwar will be taken to Swamy Pushkarini and Snapana Tirumanjanam followed by Chakra Snanam will be performed between 8:30am and 9:30am. And again the anthropomorphic form of Srivaru will be brought back to the temple.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరు 9న తిరుమలలో అనంతపద్మనాభ వ్రతం

తిరుమ‌ల‌, 2022 సెప్టెంబ‌రు 08: తిరుమలలో సెప్టెంబ‌రు 9న శుక్ర‌వారం అనంతపద్మనాభ వ్రతం జ‌రుగ‌నుంది. ప్రతి సంవత్సరం బాధ్రపదమాస శుక్ల చతుర్దశి పర్వదినాన అనంతపద్మనాభస్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ.

ఇందులో భాగంగా ఉద‌యం 8:30నుండి 9:30గంటల మ‌ధ్య‌ శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయం వద్దనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు వేంచేపుచేస్తారు. శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో అభిషేకాదులు నిర్వహించి తిరిగి ఆలయానికి వేంచేపు చేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.