ANANTA PADMANABHA VRATAM ON SEPTEMBER 1 _ సెప్టెంబరు 1న తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం
Tirumala, 30 Aug. 20: On the auspicious occasion of Anantapadmanabha Vratam on September 1, Chakrasnanam to Sri Sudarshana Chakrattalwar will be performed in Tirumala.
In view of COVID restrictions this fete which is usually performed in Swamy Pushkarini during early hours, will be observed in Tirumala temple premises this year in Ekantam.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబరు 1న తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం
తిరుమల, 2020 ఆగస్టు 30: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం భాద్రపదమాసం శుక్ల చతుర్థశి పర్వదినాన అనంత పద్మనాభస్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం అనంత పద్మనాభ వ్రతాన్ని టిటిడి నిర్వహించనుంది.
కాగా అనంతుడు అనగా ఆదిశేషుడు. ఆదిశేషుడుపై అనంతపద్మనాభస్వామివారి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యంకోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
కోవిడ్ – 19 నిబంధనల మేరకు శ్రీవారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఉదయం ఏకాంతంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు, ఆలయ అర్చకులు పాల్గొంటారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.