ANANTHAPADMANABHA VRATAM IN TIRUMALA ON SEPTEMBER 5_ సెప్టెంబరు 5న తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం

Tirumala, 3 Sep 2017: One of the important festivals, Sri Anantha Padmanabha Vratam will be observed with religious fervour in the hill town of Tirumala on September 5.

According to temple scriptures, Lord Venkateswara is believed to be an incarnation of Lord Sri Maha Vishnu. As Anantha Padmanabha Swamy, yet another form of Lord is being described as “Sayanaupa”-in a state of reclining on Ananta-the 1000-hood mighty serpent king Adisesha, the festival is observed in grandeur in all Sri Vaishnava Khetras across the country.

The image of Anantapadmanabha Swamy is also located inside the main temple complex where the pilgrim can see Lord in reclining pose. As Tirumala temple tops the list of Sri Vaishnava Divya Desams, the festival is observed on Bhadrapada Sukla Chaturdasi day every year in Tirumala.

The temple priests perform special puja to Sri Sudarshana Chakrattalwar in Swamy Pushkarini during wee hours on this auspicious day. Temple officials take part in this event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

సెప్టెంబరు 5న తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం

సెప్టెంబర్‌ 03, తిరుమల 2017: తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం భాద్రపదమాస శుక్ల చతుర్థశి పర్వదినాన అనంత పద్మనాభస్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 5వ తేదిన అనంత పద్మనాభ వ్రతాన్ని తి.తి.దే ఘనంగా నిర్వహించనుంది.

కాగా అనంతుడు అనగా ఆదిశేషుడు. ఆదిశేషుడుపై అనంతపద్మనాభస్వామివారి అవతారంలో ఉన్న శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తూ గృహస్థులు సౌభాగ్యంకోసం ఈ వ్రతాన్ని
ఆచరిస్తారు. ఈ సందర్భంగా వేకువజామున శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి

ఊరేగింపుగా తీసుకువెళ్ళి అర్చకులు భూవరాహస్వామివారి ఆలయం ప్రక్కనున్న స్వామివారి పుష్కరిణిలో ఆభిషేకాదులు నిర్వహించి తిరిగి ఆలయానికి వేంచేపు చేస్తారు.

ఈ కారక్రమంలో ఆలయ అధికారులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.