ANDAL GODAI MALAS DECKED TO MULA VIRAT _ తిరుమల శ్రీవారికి గోదా మాలలు

TIRUMALA, 16 JANUARY 2023: On the occasion of Goda Parinayam, the celestial Goda Malas which were brought from Sri Govindaraja Swamy temple reached Tirumala.

They were taken on a procession from Pedda Jeeyar mutt to Tirumala temple and later decorated to Mula Virat.

Both the Senior and Junior Pontiffs of Tirumala and temple officials were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల శ్రీవారికి గోదా మాలలు

తిరుమల, 2023 జనవరి 16: శ్రీవారికి మహా భక్తురాలైన (ఆండాళ్‌ అమ్మవారు) శ్రీ గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకొని గోదామాలాలు శ్రీవారి మూలవిరాట్‌కు సోమవారం ఉదయం అలంకరించారు.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని ఆండాళ్‌ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా అందాయి. గోదాదేవిమాలాలు తిరుపతి నుండి శ్రీశ్రీశ్రీ తిరుమల పెద్ద జియ్యార్‌స్వామివారి మఠానికి సోమవారం ఉదయం చేరుకున్నాయి. అనంతరం పెద్ద జియ్యార్‌ మఠం నుండి మంగళవాయిధ్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్టుకు అలంకరించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌ స్వామి, శ్రీ గోవిందరాజ‌స్వామివారి ఇత‌ర ఆల‌య అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.