GLORIOUS PROCESSION OF ANDAL AMMA MALAS _ వైభవంగా ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు

•  GOLDEN CHARIOT FESTIVAL ON MARCH 5

Tirupati, 04 March 2024: Andal Ammavari garlands were taken on a procession from Sri Govindaraja Swamy Temple in the morning to decorate the Srivari Garuda Seva to be held at Sri Kalyana Venkateswara Swamy Temple in Srinivasa Mangapuram on Monday at 7 PM.

A large number of devotees participated in this yatra organized in the name of Goda Kalyanayatra. 

The Yatra started at Sri Govindaraja Swamy temple at 6.30 am.  From the temple, the procession of garlands on Ambari reached Srinivasa Mangapuram via SV Gosamrakshanashala.

These garlands will be decorated for the Lord in the Srivari Garuda Seva held at night.

Sri Sri Peddajeer Swamy, Sri Sri Chinnajeer Swamy of Tirumala, spl gr Deputy EO smt. Varalakshmi DyEO Smt Shanti participated in this program.

GOLDEN CHARIOT ON MARCH 5

Golden Chariot will be celebrated on Tuesday, the sixth day of Sri Kalyana Venkateswara Swamy’s Brahmotsavam.  From 4 to 5 pm, Kalyana Venkateswara along with Sridevi Bhudevi will visit the devotees on a golden chariot in the four Mada streets of the temple. 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వైభవంగా ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు

– మార్చి 5న స్వర్ణ రథోత్సవం

తిరుపతి, 2024 మార్చి 04: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమ‌వారం రాత్రి 7 గంటలకు జరుగనున్న శ్రీవారి గరుడ సేవలో అలంకరించేందుకు ఉదయం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి ఆండాళ్‌ అమ్మవారి మాలలను ఊరేగింపుగా తీసుకెళ్లారు.

గోదా కల్యాణయాత్ర పేరిట నిర్వహించిన ఈ యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యాత్ర శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. ఆలయం నుండి ఎస్వీ గోసంరక్షణశాల, తాటితోపు, పెరుమాళ్లపల్లి మీదుగా అంబారీపై మాలల ఊరేగింపు శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది.

భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా అంబారీపై మాలలు ఆలయానికి చేరుకున్నాయి.

రాత్రి జరిగే శ్రీవారి గరుడ సేవలో ఈ మాలలను స్వామివారికి అలంకరించనున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు శ్రీమతి వరలక్ష్మీ, శ్రీమతి శాంతి పాల్గొన్నారు.

మార్చి 5న స్వర్ణ రథోత్సవం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన మంగ‌ళ‌వారం స్వర్ణ రథోత్సవం వైభవంగా జరుగనుంది. సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు స్వర్ణ రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు గజవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.