ANDAL NEERATOTSAVAM_ జ‌న‌వ‌రి 7 నుండి 13వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాల్‌ అమ్మవారి నీరాటోత్సవం

Tirupati, 3 Jan. 19: The festival of Andal Sri Godai Neeratotsavam will be observed in Sri Govinda Raja Swamy temple from January 7 to 13 in Tirupati.

Everyday the goddess will be taken to Sri Ramachandra Pushkarini on a celestial procession during this period and abhishekam with lukewarm water is performed.

Later in the evening, Andal returns to Sri Govinda Raja Swamy temple.

During the holy month of Dhanurmasa, this fete is observed to mark the penance performed by Andal to appease Lord Sri Ranghanatha (Venkateswara).

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జ‌న‌వ‌రి 7 నుండి 13వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాల్‌ అమ్మవారి నీరాటోత్సవం

తిరుపతి, 2019 జనవరి 03: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ అమ్మవారి నీరాటోత్సవం జ‌న‌వ‌రి 7 నుండి 13వ తేదీ వ‌ర‌కు ఘనంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి శ్రీ రామచంద్ర పుష్కరిణికి ఊరేగింపుగా వెళతారు. అక్కడ వేడినీళ్లతో అభిషేకం చేస్తారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం 4.00 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఆండాళ్‌ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.