ANDAL NEERATOTSAVAMS CONCLUDES _ ముగిసిన శ్రీ ఆండాళ్‌ నీరాటోత్సవాలు

Tirupati, 13 January 2024:The seven-day long Andal Niratotsavam at Sri Govindaraja Swamy temple in Tirupati concluded on Saturday.

On this occasion at 5.30 in the morning, Sri Andal Ammavaru left in a procession and reached Neerata Mandapam and later paraded along the streets.

In the evening Sri Andal takes procession around Sri Kodandaramalayam on golden Tiruchi and returns to Sri Govindaraja Swamy temple.

Every year in Dhanurmasam, this festival is held to symbolize the penance performed by Sri Andal for Her Lord.

Temple Deputy EO Smt.Shanti, AEO Sri. Munikrishna Reddy, Superintendents Sri Narayana, Sri. Mohan and others were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముగిసిన శ్రీ ఆండాళ్‌ నీరాటోత్సవాలు

తిరుపతి, 13 జనవరి 2024: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏడురోజుల పాటు జరిగిన శ్రీ ఆండాళ్‌ నీరాటోత్సవాలు శనివారం ముగిశాయి.

ఈ సందర్భంగా ఉదయం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు ఊరేగింపుగా బయల్దేరి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మాడ వీధులు, చిన్నబజారు వీధి, శ్రీకోదండరామాలయం మాడ వీధుల గుండా రామచంద్ర కట్టపై గల నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడున్న మండ‌పంలో అమ్మ‌వారిని కొలువుతీర్చి వేడినీళ్లతో అభిషేకం చేశారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీ ఆండాళ్‌ అమ్మవారు బంగారు తిరుచ్చిపై శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అడుగుడుగునా హారతులు సమర్పించారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఆండాళ్‌ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ నారాయణ, శ్రీ మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ రాధాకృష్ణ, శ్రీ ధనుంజయ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.