ANDAL TIRUVADIPURAM UTSAVA AT SRI GT FROM AUG 2-11 _ ఆగ‌స్టు 2 నుండి 11వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవం

Tirupati, 1 August 2021: TTD will be organising a ten-day festival of Andal Tiruvadipuram Utsava from August 2-11 at the Sri Govindaraja Swamy temple.

As part of festivities daily Tirumanjanam and Asthanam will be conducted for utsava idol of Sri Andal Ammavaru in Ekantham as per Covid guidelines.

Among others, Sri Chakrathalwar Sattumora and Sri Prativadi Bhayankara Annan Sattumora will be held on August 8.

Similarly Snapana Tirumanjanam for utsava idols of Sri Govindaraja Swamy and Sri Andal Ammavaru will be performed on August 11.

TTD has however cancelled the procession of both utsava idols up to Padala Mandapam at Alipiri due to Covid restrictions.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 2 నుండి 11వ తేదీ వ‌ర‌కు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవం

తిరుపతి, 2021 ఆగ‌స్టు 01: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగ‌స్టు 2 నుండి 11వ తేదీ వ‌ర‌కు శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం అమ్మవారికి ఆస్థానం నిర్వహిస్తారు.

ఆగస్టు 8వ తేదీన ఆల‌యంలో శ్రీ చ‌క్ర‌త్తాళ్వార్ సాత్తుమొర‌, శ్రీ ప్ర‌తివాది భ‌యంక‌ర అన్న‌న్ సాత్తుమొర జ‌రుగ‌నున్నాయి. ఆగస్టు 11న శ్రీ ఆండాళ్‌ అమ్మవారి శాత్తుమొర సంద‌ర్భంగా ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌కు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఊరేగింపును కోవిడ్‌-19 కార‌ణంగా టిటిడి ర‌ద్దు చేసింది. ఈ కార‌ణంగా ఆల‌యంలోనే ఉభ‌య‌దారులు ఉభ‌యం స‌మ‌ర్పిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.