ANIVARA ASTHANAM AT SRIVARI TEMPLE ON JULY 17 _ జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

Tirumala, 15 July 2022: TTD is organizing the annual fete of Anivara Asthanam at Srivari temple on July 17. 

 

Ever since the TTD took over the reins of Tirumala temple administration TTD board shifts the budget functions for year ending March-April. But the fete is observed symbolically at the end of Ani Masam, the last day as per the Tamil Calendar in the month of Ani.

 

SIGNIFICANCE OF FESTIVAL

 

On this day utsava idols of Sri Malayappa and His consorts are brought on Sarvabhoopala Vahanam to Bangaru Vakili along with the idol of Sri Viswaksena. Special pujas, Prasadam and Kainkaryams are performed for them and also to the Mula Virat simultaneously.

 

JEEYAR SWAMY PRESENT VASTRAM

 

Tirumala pontiff Sri Sri Sri Pedda Jeeyarswamy brings six big pattu vastrams on a silver platter over his head to Srivari temple of which he presents four vastrams to Mula Virat and two to utsava idols of Sri Malayappa and Sri Viswaksena.

 

Thereafter chief archaka dressed in pattu vastram for occasion bless the Tirumala pontiffs and TTD EO by symbolically handing over temple keys and place the keys at Srivari feet after Harati, Chandana, Tambulam, and Thirtha and Shatari honours.

 

PUSHPA PALLAKI SEVA

As part of Anivara Asthanam festivities, Sri Malayappa swami and His consorts are paraded in the evening in a Pushpa Pallaki along the Mada streets and bless devotees.

 

CANCELLATIONS OF ARJITA SEVA

 

In view of Anivara Asthanam on July 17, TTD has cancelled the Arjita sevas of Kalyanotsavam, Unjal Seva, Sahasra Deepalankara seva on Sunday.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం

తిరుమల, 2022 జూలై 15: తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినం ఘనంగా జరుగనుంది.

చారిత్రక నేపథ్యం :

సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలలకు మార్చారు.

ఉత్సవ విశిష్టత :

ఈ ఉత్సవం రోజున ఉదయం బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవమూర్తులతో పాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదిస్తారు.

పుష్ప పల్లకీపై ఊరేగింపు :

ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.

ఆర్జిత‌సేవ‌లు ర‌ద్దు :

ఆణివార ఆస్థానం కార‌ణంగా జూలై 17న‌ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.