ANIVARA ASTHANAM HELD WITH RELIGIOUS FERVOUR IN TIRUMALA _ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

TIRUMALA, 16 JULY 2021: Religious fervour marked the annual Anivara Asthanam held at the Hill Shrine of Sri Venkateswara Swamy temple at Tirumala on Thursday.

Asthanam was rendered upon the deities of Malayappa Swamy and His two consorts seated atop the golden Sarva Bhoopala Vahanam in the presence of Viswaksena, the commander-in-chief of the army of Srivaru at Bangaru Vakili followed by other festivities in adherence to the COVID health advisories.

As is a practice since centuries, both senior and junior pontiffs of the Tirumala temple along with TTD Executive Officer Dr KS Jawahar Reddy and Additional EO Sri A.V. Dharma Reddy presented six of silk vastrams to be adorned to the deities.

Later speaking to media persons outside Tirumala temple, TTD EO said, Anivara Asthanam is a traditional annual Budget fete which is being observed in Tirumala on the last day of Ani month of the Tamilians since the age of Mahants. When the TTD Board came into existence, since then the annual budget of TTD was shifted to March. However, in honour of the age-old tradition, Anivara Asthanam will be observed every year on this day. The EO also said, six pattu vastrams were presented by Tirumala Pedda Jeeyangar and Chinna Jeeyangar Swamy on the occasion. Out of which four were adorned to Mulamurthy while one vastram to Sri Malayappa Swamy and another to Sri Viswaksena. The Honourable Minister of Endowments from Tamilnadu, Sri Sekhar Babu also presented vastrams on behalf of Sri Ranganatha Swamy temple as is customary. In the evening Pushpa Pallaki Seva will be observed”, he maintained.

SILKS FROM RANGANATHA PRESENTED TO SRINIVASA

After the Asthanam, the Honourable Minister of Endowments of Tamilnadu Sri Sekhar Babu along with the authorities from the Sri Ranganathaswamy temple at Srirangam presented six pairs of silk vastrams to the temple which were carried in a procession from the Bedi Anjaneyaswamy temple after going around the Mada streets.

The Endowments Secretary of Tamilnadu Sri Chandramohan, Sri Rangam temple Joint Commissioner Sri Marimuttu and entourage were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం

తిరుమల, 2021 జులై 16: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్ర‌వారంనాడు సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.

ముందుగా ఉదయం 7 నుండి 9.30 గంటల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు.

అనంతరం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఈవో, అద‌న‌పు ఈవో ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు.

తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ”పరివట్టం”(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగారికి, టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి గారికి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచ‌డంతో ఆణివార ఆస్థానం ముగిసింది.

శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ

ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగ‌నాథ‌స్వామివారి ఆల‌య అధికారులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

శుక్ర‌వారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్ర‌ద‌క్షిణ‌గా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

వార్షిక లెక్కలు ప్రారంభించిన రోజు : టిటిడి ఈవో

ఈ ఉత్స‌వం అనంత‌రం ఆల‌యం వెలుపల ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తార‌ని చెప్పారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వ‌చ్చింద‌న్నారు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవ‌ని తెలిపారు. టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలలకు మార్చిన‌ట్టు వివ‌రించారు. సాయంత్రం పుష్ప‌ప‌ల్ల‌కీపై స్వామి, అమ్మ‌వారు నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తార‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో త‌మిళ‌నాడు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ శేఖ‌ర్‌బాబు, దేవాదాయ శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ చంద్ర‌మోహ‌న్‌, క‌మిష‌న‌ర్ శ్రీ కుమ‌ర‌గురుభ‌ర‌న్‌, శ్రీ‌రంగం ఆల‌య జాయింట్ క‌మిష‌న‌ర్ శ్రీ మారిముత్తు, టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.