ANKURARPANA HELD _ శ్రీ కపిలేశ్వరాలయ‌ పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

TIRUPATI, 09 JULY 2022: The Ankurarpana for annual Pavitrotsavams in Sri Kapileswara Swamy temple was held on Saturday evening in Tirupati.

The three day annual fete will be observed between July 10 and July 12.

Deputy EO Sri Devendrababu, AEO Sr Srinivasulu, Superintendent Sri Bhupati, Temple Inspector Sri Reddi Sekhar and others were present.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయ‌ పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2022 జులై 09: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జులై 10 నుండి 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు.

జులై 10న ప‌విత్ర ప్ర‌తిష్ఠ, జులై 11న గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, జులై 12న మ‌హాపూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. ‌చివరిరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రహ్మ‌ణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లకు తిరువీధి ఉత్స‌వం నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, సూప‌రింటెండెంట్లు శ్రీ భూప‌తి, శ్రీ శ్రీ‌నివాసులు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రెడ్డిశేఖ‌ర్‌ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.