ANKURARPANA HELD _ శాస్త్రోక్తంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
VONTIMITTA, 09 APRIL 2022: The Beejavapanam ritual for Vontimitta annual Brahmotsavam is held on Saturday evening as per the tenets of Pancharatra Agama.
On April 10 on the auspicious day of Sri Rama Navami, the grand Dhwajarohanam will be performed between 8am and 9am in the Vrishabha Lagnam.
In the Ankurarpana fete temple DyEO Sri Ramana Prasad, AEO Subramanyam, Superintendent Sri Venktesayya, Temple Inspector Sri Dhananjeya and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శాస్త్రోక్తంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 09: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 10 నుంచి 18వ తేదీ వరకు జరుగనున్న వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. రాత్రి 6 నుండి 8 గంటల వరకు అర్చకుల వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, కలశం ప్రతిష్ట, కలశపూజ, వాసుదేవ పుణ్యాహవాచనము, కంకణధారణ చేశారు. అనంతరం పుట్టమన్ను సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కంకణభట్టార్ శ్రీ కెహెచ్.రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఏప్రిల్ 10న ధ్వజారోహణం :
ఏప్రిల్ 10న ఆదివారం ఉదయం 8 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శేష వాహనసేవ నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు
తేదీ ఉదయం రాత్రి
10-04-2022(ఆది) ధ్వజారోహణం(ఉ|| 8-9గం||ల)(వృషభ లగ్నం), పోతన జయంతి, శేషవాహనం.
11-04-2022(సోమ) వేణుగాన అలంకారం, హంస వాహనం.
12-04-2022(మంగళ) వటపత్రశాయి అలంకారం, సింహ వాహనం.
13-04-2022(బుధ) నవనీతకృష్ణ అలంకారం, హనుమత్సేవ.
14-04-2022(గురు) మోహినీ అలంకారం, గరుడసేవ.
15-04-2022(శుక్ర) శివధనుర్భంగాలంకారం, శ్రీ సీతారాముల కల్యాణం (రా|| 8 గం||లకు), గజవాహనం.
16-04-2022(శని) రథోత్సవం.
17-04-2022(ఆది) కాళీయమర్ధన అలంకారం, అశ్వవాహనం.
18-04-2022(సోమ) చక్రస్నానం, ధ్వజావరోహణం(రా|| 7 గం||).
19-04-2022(మంగళ) పుష్పయాగం(సా|| 6 గం||).
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ డా. రమణప్రసాద్, ఏఈఓ శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఆర్.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.