ANKURARPANA HELD FOR SRINIVASA VISWASHANTI HOMAM _ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

TIRUMALA, 12 DECEMBER 2022: The Ankurarpana fete was held for Sri Srinivasa Viswashanti Homam in Dharmagiri Veda Vignana Peetham in Tirumala on Monday evening.

This ritual will be observed between December 13-18 under the supervision of Principal Sri KSS Avadhani.

About 22 Ritwiks will perform this Homam seeking the prosperity and well-being of humanity which will be live telecasted on SVBC for the sake of global devotees between 9am and 12noon, again from 6pm to 8:30pm.

TTD Trust Board Chairman Sri YV Subba Reddy, EO Sri AV Dharma Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

– డిసెంబరు 13 నుండి 18వ తేదీ వరకు హోమ కార్యక్రమాలు

తిరుమల, 12 డిసెంబరు, 2022: తిరుమ‌ల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమానికి సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వహించారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ఆచార్యవరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత యాగశాల వైదిక కార్యక్రమాలు, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం చేశారు.

ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్‌ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వ‌ర్యంలో డిసెంబరు 13 నుండి 18వ తేదీ వరకు 22 మంది రుత్వికులు శ్రీ శ్రీనివాస విశ్వశాంతి హోమం నిర్వ‌హించనున్నారు.

ప్రతిరోజూ ఉదయం 9 నుండి 12 గంటల వ‌ర‌కు, సాయంత్రం 6 నుండి 8.30 గంటల వరకు హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.