ANKURARPANA HELD FOR VASANTHOTSAVAMS _ శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

TIRUPATI, 03 MAY 2023: The Ankurarpana ritual for annual Vasanthotsavams in Sri Padmavathi Ammavari temple at Tiruchanoor was observed on Wednesday.

 

From Thursday onward till Saturday, the spring festival will be observed in Friday Gardens for three days between 2.30pm and 4.30pm.

 

TTD has cancelled Arjitha sevas till May 6 following this annual festival.

 

DyEO Sri Govindarajan and other temple officials were present in Ankurarpanam.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2023 మే 03: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో వసంతోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 గంటల నుండి పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 4 నుండి 6వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.

ఈ ఉత్స‌వాల్లో భాగంగా మే 4 నుండి 6వ తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు మ‌ధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 .30 నుండి 8.30 గంటల వరకు అమ్మ‌వారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. మే 5వ తేదీ ఉదయం 9.10 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.

ఈ ఉత్స‌వాల కార‌ణంగా మే 2 నుండి 6వ తేదీ వ‌రకు క‌ల్యాణోత్స‌వం, సహ‌స్ర‌దీపాలంకార‌సేవ‌, మే 3న అష్టోత్తర శతకలశాభిషేకం, మే 5న లక్ష్మీ పూజ ఆర్జిత‌సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ మధు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ సుభాష్, శ్రీ ప్రసాద్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.