ANKURARPANA PERFORMED TO SRI KT PAVITROTSAVAMS_ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు ఘనంగా అంకురార్పణ

Tirupati, 4 July 2017: The Ankurarpana was performed on Tuesday for annual pavitrotsavams in Sri Kapileswara Swamy temple in Tirupati.

The three day fete will be observed from July 5 to 7. Every day there will snapana tirumanjanam to Panchamurthies including Sri Kapileswara Swamy, Kamakshi Devi, Sri Vighneswara Swamy, Sri Subrahmanya Swamy and Sri Chandikeswara Swamy.

On first day there will Pavitra Pratishta, followed by Grandhi Samarpana on Second day and Maha Purnahuti on Third day.

Temple DyEO Sri Subramanyam is supervising the arrangements.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు ఘనంగా అంకురార్పణ

తిరుపతి, 2017 జూలై 04: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జులై 5 నుండి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న పవిత్రోత్సవాలకు మంగళవారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6.00 నుంచి 8.00 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించనున్నారు.

పవిత్రోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహిస్తారు. ఆనంతరం పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షమ్మ, శ్రీవిఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు కల్యాణ మండపంలో స్నపనతిరుమంజనం చేపడతారు. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట, రెండో రోజు గ్రంథి పవిత్ర సమర్పణ, మూడో రోజు మహాపూర్ణాహుతి క్రతువులు నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాన్ని ఆర్జిత సేవగా ప్రవేశపెట్టారు. రూ.500/- చెల్లించి ఇద్దరు గ హస్థులు పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న గ హస్థులకు ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె, చివరి రోజు పవిత్రమాలలు బహుమానంగా అందజేస్తారు.

ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో పౌర్ణమి ముందు ఉన్న చతుర్దశినాటికి పూర్తయ్యేలా మూడు రోజుల పాటు శ్రీకపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తుల వల్ల తెలిసీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఏమాత్రం లోపం కలగకుండా శైవాగమశాస్త్రం ప్రకారం మూడు రోజుల పాటు శ్రీకపిలేశ్వరస్వామివారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.