ANKURARPANAM AT SRI PAT FOR PAVITHROTSAVAM _ శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

Tiruchanoor, 17 Sep. 21: The auspicious ritual of Ankurarpanam was performed on Friday evening for the annual festival of Pavitrotsavam at Sri Padmavathi Ammavari temple.

  

TTD has cancelled all arjita sevas in Tiruchanoor temple from Friday to facilitate As part of the fete Viswaksena Aradhana, Punyahavachanam, Raksha Bandhanam, Mritsangraham, Senadhipathi Utsavam, Ankurarpanam and Pavitra Adhivasam were held in Sri Padmavathi Ammavaru at Tiruchanoor,

 

TTD Chairman Sri YV Subba Reddy, JEO Smt Sada Bhargavi, DyEO Smt Kasturi Bai, Agama advisor Sri Srinivasacharyulu, AEO Sri Prabhakar Reddy, Superintendent Sri Seshagiri and others participated.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ

తిరుప‌తి, 2021 సెప్టెంబ‌రు 17: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి పవిత్రోత్సవాలకు శుక్ర‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించారు. ఆల‌యంలో సెప్టెంబ‌రు 18 నుండి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం సాయంత్రం 6 నుంచి విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, పవిత్ర అధివశం నిర్వహించారు.

ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

సెప్టెంబ‌రు 18వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 19న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 20న మ‌హాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. కోవిడ్ – 19 నిబంధన‌ల మేర‌కు అమ్మ‌వారి ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.‌

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు, జె ఈవో శ్రీమతి సదా భార్గవి ,ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్‌ శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాజేష్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.