ANKURARPANAM FOR PUSHPAYAGAM IN SKVST HELD _ శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ

TIRUPATI, 03 APRIL 2024: The annual Pushpayagam in Sri Kalyana Venkateswara Swamy temple will be observed by 

TTD on April 4 and in this connection the ritual of prelude Ankurarpanam was held on Wednesday evening.

The annual brahmotsavams in this famous shrine were held from February 29 to March 8 in a grand manner. 

As a “Prayaschita” to the sins committed either knowingly or unknowingly by the religious, temple staffs and even devotees, Pushpa Yagam is bring observed as an annual fete.

Religious festivities like Punyahavachanam, Mritsangrahanam, Senadhipathi Utsavam were observed before Beejavapanam.

Special Grade DyEO Smt Varalakshmi, AEO Sri Gopinath, Superintendents Sri Chengalrayalu, Sri Venkata Swami and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ

తిరుప‌తి, 2024 ఏప్రిల్ 03: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 4న జరుగనున్న పుష్పయాగానికి బుధ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

సాయంత్రం 6 గంటల నుండి పుణ్యాహ‌వ‌చ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్పణం చేపట్టారు.

ఏప్రిల్ 4న ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం జరుగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.

శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 4న తిరుప్పావ‌డ‌, నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయలు, శ్రీ వెంకట స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.