ANKURARPANAM FOR PUSHPAYAGAM PERFORMED_ శ్రీవారి పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ

Tirumala, 27 October 2017: The Ankurarpanam ritual was performed on Friday evening in connection with annual Pushpayagam on Saturday.

The processional deity of Sri Vishwaksenulavaru was taken on a celestial ride along the four mada streets before the seed sowing festival is commenced.

Later the ritual of Beejavapanam was performed inside the Yagashala in Srivari temple amidst the chanting of vedic mantras.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, Temple DyEO Sri Rama Rao, Peishkar Sri Ramesh, VGO Sri Raveendra Reddy and officials took part in this fete.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ

అక్టోబరు 27, తిరుమల, 2017: కార్తీకమాసంలో శ్రవణా నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని అక్టోబరు 28న తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే పుష్పయాగ మహోత్సవానికి శుక్రవారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జ‌ర‌గ‌నుంది.

ఈ సందర్భంగా వసంతోత్సవాన్ని, సహస్రదీపాలంకారసేవను టిటిడి రద్దు చేసింది. కాగా రాత్రి 7 గంటలకు శ్రీ సేనాధిపతివారు వసంత మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ మృత్సంగ్రహణం, ఆస్థానం చేపడతారు. ఆ తరువాత యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

పుష్పయాగాన్ని పురస్కరించుకొని శనివారం ఉదయం 9 నుండి 11 గంటల నడుమ ఆలయంలోని కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగాన్ని అత్యంత వైభవంగా చేపడతారు.

పుష్పయాగం కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, అర్జితబ్రహ్మూెత్సవం, వసంతోత్సవం సేవలను టిటిడి రద్దు చేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.