ANKURARPANAM FOT SKVST BTUs ON FEBRUARY 13 _ ఫిబ్రవరి 13న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Tirupati, 12 Feb. 20: The seed sowing festival of Ankurarpanam will be performed on February 13 for the annual brahmotsavams at Srinivasa Mangapuram, which are going to commence from February 14.
As a part of this ritual, the sacred soil is collected and navadhanyas are being sown in different mud pots. Before that Vishwaksena Aradhana is performed.
This fete signifies, that the moon rays fell on these nine mud pots called Palikas which help in the healthy growth of seeds thus signifying the successful conduct of annual brahmotsavams.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఫిబ్రవరి 13న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, 2020 ఫిబ్రవరి 12: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయంలో చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు, ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
ఫిబ్రవరి 13న అంకురార్పణ :
ఫిబ్రవరి 13వ తేదీ గురువారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.
ఫిబ్రవరి 14న ధ్వజారోహణం :
ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం ధ్వజారోహణంతో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉదయం 9.45 నుండి 10.10 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
14-02-2020(శుక్రవారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం
15-02-2020(శనివారం) చిన్నశేష వాహనం హంస వాహనం
16-02-2020(ఆదివారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
17-02-2020(సోమవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
18-02-2020(మంగళవారం) పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
19-02-2020(బుధవారం) హనుమంత వాహనం స్వర్ణరథం, గజ వాహనం
20-02-2020(గురువారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
21-02-2020(శుక్ర వారం) రథోత్సవం అశ్వవాహనం
22-02-2020(శనివారం) చక్రస్నానం ధ్వజావరోహణం
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.