ANKURARPANAM HELD _ శ్రీ కోదండరామాలయంలో పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ

TIRUPATI, 25 APRIL 2023: The Ankurarpanam for annual Pushpayagam at Sri Kodandarama Swamy temple in Tirupati was held on Tuesday evening.

 

The Pushpayagam will take place on Wednesday evening between 4pm and 6pm to Sri Sita Lakshmana sameta Sri Rama with various traditional and aromatic flowers.

 

The Grihasta devotees shall have to pay Rs.1000 per ticket on which two persons will be allowed.

 

DyEO Nagaratna and other temple staff, archakas were present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ కోదండరామాలయంలో పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ
 
ఏప్రిల్‌ 25,  తిరుపతి 2023: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 26వ తేదీ బుధవారంనిర్వహించనున్న పుష్పయాగానికి మంగళవారం సాయంత్రంఘనంగా అంకురార్పణ జరిగింది. 
 
ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆచార్య రుత్విక్ వరణం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సేనాధిపతి ఉత్సవం, రాత్రి 7 గంటలకు మేదినీపూజ, మృత్సంగ్రహణం,  శాస్త్రోక్తంగా అంకురార్పణం చేపట్టారు.
 
ఏప్రిల్‌ 26న బుధవారం ఉదయం 10 గంటలకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.1000/- చెల్లించి టికెట్‌ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు.
 
శ్రీ కోదండరామాలయంలో మార్చి 20 నుంచి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.