ANKURARPANAM HELD _ శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయంలో శ్రీవరాహస్వామివారి ఆలయ ”బాలాలయం మహాసంప్రోక్షణ” కు అంకురార్పణ
Tirumala, 5 Dec. 20: Ankurarpanam for Balalaya Maha Samprokshana of
Sri Varahaswami temple was held at Srivari temple at Tirumala on Saturday.
Following incessant rains in hill town, the Ankurarpanam fete was held at the Yagashala of Srivari temple instead of Sri Varahaswami temple.
Agama Advisor Sri NAK Sundaravaradan, Chief Priest Sri Venugopala Deekshitulu, Additional EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Harindranath were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయంలో శ్రీవరాహస్వామివారి ఆలయ ”బాలాలయం మహాసంప్రోక్షణ” కు అంకురార్పణ
తిరుమల, 2020 డిసెంబరు 05 : శ్రీవారి ఆలయంలో శనివారం రాత్రి శ్రీవరాహస్వామివారి ఆలయ బాలాలయ మహాసంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 10.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని అదనపు పరకామణి ప్రాంతంలో ఇందుకోసం ఏర్పాటు చేసిన యాగశాలలో సేనాధిపతి ఉత్సవం, పుణ్యాహవచనం, మేదినిపూజ నిర్వహించి, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
శ్రీవారి ఆలయంలో రుత్విక్‌వరణం
శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం రుత్విక్ వరణం(ఆచార్యవరణం)తో శ్రీవరాహస్వామివారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి రుత్వికులకు వస్త్రప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో కంకణబట్టార్ శ్రీ వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ ఎన్ఎకె.సుందరవరదచార్యులు, శ్రీ మోహన రంగాచార్యులు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, రుత్వికులు, అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.