ANKURARPANAM HELD _ శ్రీ కోదండరామాలయంలో పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ
Tirupati, 11 May 2024: The seed sowing ritual-Ankurarpanam was observed with religious fervour in Sri Kodanda Ramalayam in Tirupati on Saturday evening in connection with annual Pushpayagam on Sunday evening.
The Grihas devotees shall pay Rs.1000 per ticket on which two persons will be allowed for Pushpayagam.
Superintendent Sri Soma Sekhar and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ కోదండరామాలయంలో పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ
తిరుపతి, 2024 మే 11: తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మే 12వ తేదీ ఆదివారంనిర్వహించనున్న పుష్పయాగానికి శనివారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరిగింది.
ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆచార్య రుత్విక్ వరణం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సేనాధిపతి ఉత్సవం, రాత్రి 7 గంటలకు మేదినీపూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణం చేపట్టారు.
మే 12న ఆదివారం ఉదయం 10 గంటలకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
గృహస్తులు(ఇద్దరు) రూ.1000/- చెల్లించి టికెట్ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు.
శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 5 నుండి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ సోమ శేఖర్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.