ANKURARPANAM HELD _ శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ య‌జ్ఞానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

TIRUPATI, 30 AUGUST 2023: Ankurarpanam was held to Sri Lakshmi Narayana Yagnam in Sri Vakulamata temple held on Wednesday evening.

Seeking the welfare of humanity, this homam is organised.

State Minister Sri Peddireddi Ramachandra Reddy, Special GrDyEO Smt Varalakshmi and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ య‌జ్ఞానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుప‌తి, 2023 ఆగస్టు 30: లోక‌క్షేమం కోసం పేరూరు బండ‌పై గ‌ల శ్రీ వ‌కుళ‌మాత ఆల‌యంలో చేప‌ట్టిన శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ య‌జ్ఞానికి బుధ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది.

ఇందులో భాగంగా విష్వ‌క్సేనారాధ‌న‌, పుణ్యాహ‌వ‌చ‌నం, అంకురార్ప‌ణ‌, అగ్నిప్ర‌ణ‌య‌నం, కుంభారాధ‌నం, ఉక్త‌హోమం, ల‌క్ష్మీ య‌జ్ఞం, వేద‌పారాయ‌ణం చేప‌ట్టారు. ఆగ‌స్టు 31న ఉద‌యం స‌రస్వ‌తీ న‌వ‌గ్ర‌హ – సుద‌ర్శ‌న హోమాలు, సాయంత్రం దీపోత్స‌వం చేప‌డ‌తారు. సెప్టెంబ‌రు 1న ల‌క్ష్మీపూజ‌, కుంకుమార్చ‌న, మ‌హాపూర్ణాహుతి జ‌రుగ‌నున్నాయి.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు, ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, సూపరింటెండెంట్ శ్రీ వెంకటేశ్వర్లు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.