ANKURARPANAM HELD FOR CHANDRAGIRI RAMALAYAM _ చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌ 

TIRUPATI, 29 MARCH 2023: The ritual of prelude, Ankurarpanam was held at Sri Kodandarama Swamy temple at Chandragiri on Wednesday.

 

The annual brahmotsavams will be observed between March 30 to April 8.

Dhwajarohanam will take place on Thursday in the auspicious Mesha Lagnam between 7.45am and 8.15am.

 

Temple DyEO Sri Devendra Babu, AEO Sri Partasaradhi, Superintendent Sri Srinivasulu, Temple Inspector Sri Gopala Krishna, archakas participated.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2023 మార్చి 29: చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు జ‌రుగ‌నున్న బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6 నుండి అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, మేదినిపూజ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు , టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ గోపాలకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

మార్చి 30న ధ్వ‌జారోహ‌ణం

శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల‌కు మార్చి 30న ఉద‌యం 7.45 నుండి 8.15 గంట‌ల మ‌ధ్య మేష ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం జ‌రుగ‌నుంది.

ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు శ్రీ కోదండ రామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏప్రిల్ 5వ తేదీ ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు శ్రీసీతారాముల కల్యాణోత్సవం, సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.

ఏప్రిల్ 7వ తేదీ ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌ర్ల‌కు, చక్రత్తాళ్వార్‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, ఉద‌యం 10 నుండి 10.30 గంటల వ‌ర‌కు చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6.౩౦ రాత్రి 7.30 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు శ్రీ రామపట్టభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు.

కాగా, ఏప్రిల్ 5న ఉద‌యం 10 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి ఇద్దరుకల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, సంగీత కచేరీలు నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.