ANKURARPANAM HELD IN SRI KT_ శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

Tirupati, 12 Jul. 19: The Ankurarpanam for annual Pavitrotsavams held at Sri Kapileswara Swamy temple in Tirupati on Friday evening.

The three day celestial fete will commence in this famous shrine of Lord Shiva from Saturday.

As a prelude to this fete, Ankurarpanam or Beejavapanam was observed as per the tradition of Saivagama in the temple.

Temple DyEO Sri Subramnaym and others participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

జూలై 12, తిరుపతి, 2019: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 13 నుండి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలకు శుక్ర‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి.

కాగా, జూలై 13న శ‌నివారం ప‌విత్రోత్స‌వాల్లో మొదటిరోజు ఉద‌యం 9 నుండి 12 గంట‌ల వ‌ర‌కు పంచమూర్తులైన శ్రీకపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షమ్మ అమ్మవారు, శ్రీవిఘ్నేశ్వరస్వామి, శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీచండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ప‌విత్రోత్స‌వ కార్య‌క్ర‌మాల్లో భాగంగా క‌ల‌శ‌పూజ‌, హోమం, పవిత్ర ప్రతిష్ట నిర్వ‌హిస్తారు. అదేవిధంగా, జూలై 14న ఆదివారం గ్రంధి పవిత్ర సమర్పణ, జూలై 15న సోమ‌వారం మహాపూర్ణాహుతి కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో పౌర్ణమి ముందున్న చతుర్దశి నాటికి పూర్తయ్యేలా మూడు రోజుల పాటు స్వామివారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ప‌విత్రోత్స‌వాల్లో పాల్గొనవచ్చు. గృహస్తుల‌కు ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె, చివరిరోజు పవిత్రమాలలు బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈఓ శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ ఎం.స‌త్య‌నారాయ‌ణ‌, సూప‌రింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌, అర్చ‌కులు శ్రీ ఉద‌య‌శంక‌ర్ గురుకుల్‌, శ్రీ స్వామినాథ గురుకుల్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రెడ్డిశేఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.