ANKURARPANAM PERFORMED _ ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు అంకురార్పణ
Tirupati, 8 Sep. 19: The celestial ritual Ankurarpanam was performed in the temple of Sri Govinda Raja Swamy in Tirupati on Sunday evening for Pavitrotsavams.
The three day fete will commence on Monday and conclude on September 11.
On Sunday Vishwaksena Puja, Mritsangrahanam and Beejavapanam were performed by the priests.
Temple Spl Gr DyEO Smt Varalakshmi and other office staffs were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఘనంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, 2019 సెప్టెంబరు 08: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 9 నుండి 11వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా రుత్విక్‌వరణం, మృత్సంగ్రహణం, పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. ఆ తరువాత అంకురార్పణ జరిగింది.
కాగా, సెప్టెంబరు 9న ఉదయం పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 10న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, మాడ వీధుల్లోని శ్రీమఠం ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పించనున్నారు. సెప్టెంబరు 11న పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి.
ఈ మూడు రోజుల పాటు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు చివరిరోజు పవిత్రమాలను బహుమానంగా అందజేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.