ANKURARPANAM PERFORMED FOR ANNUAL BRAHMOTSAVAMS _ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ

TIRUMALA, OCT 4:  Ankurarpanam’ ritual has been performed with religious fervour in the hill temple of Tirumala on Friday evening.

As a prelude to the annual salakatla brahmotsavams,Ankurarpanam or the “sacred seed sowing ritual” is performed at 7pm in Tirumala wherein nine types of holy seeds in earthen containers have been sowed in holy soil (Mrisangrahana). This ritual signifies the beginning of festival in the temple. This is followed by recital of vedic hymns.

Earlier the commander-in-chief of Lord Venkateswara, Sri Vishwaksena Swamy has been taken around the four mada streets in a grand procession. The celestial warrior has invited all the three crore deities to take part in the nine-day mega religious event of his Supremo Master.

Sri K.Bapi Raju, Chairman, TTDs, Sri M.G.Gopal, Executive Officer, Sri K.S.Sreenivasa Raju, Joint Executive Officer, Sri GVG Ashok Kumar, CV&SO, Sri Sivakumar Reddy, Addl CV&SO, Sri Chinnamgari Ramana, DyEO(Temple), Sri R.Selvam, Peishkar, Sri Ajay, Parpathyedar and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ

తిరుమల, 04 అక్టోబరు 2013 : అక్టోబరు 5 నుండి ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తిరుమలలో అంకురార్పణ మహోత్సవం వైభవంగా జరుగనుంది.

సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఉత్సవాలుగా చెప్పుకునే బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీ. శ్రీస్వామివారి వాహనాల్లో అత్యంత ఉత్కృష్టమైనదిగా పిలువబడే రథోత్సవంనాడు మాత్రం సాక్షాత్తు బ్రహ్మదేవుడే శ్రీ వేంకటేశ్వరస్వామివారి తేరు యొక్క పగ్గాలను స్వయంగా లాగుతాడని ప్రశస్తి. అందుకే ఇవి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధిగాంచాయి.

అంకురార్పణః- ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు ముందురోజు సాయంకాలం స్వామివారి సేనాధిపతియైన శ్రీ విష్వక్సేనుల వారిని ఆలయ మాడవీధులలో ఊరేగింపుగా తీసుకువెళ్ళి అనంతరం భూమిపూజ వగైరాదులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం మృత్సంగ్రహణం చేసి ప్రదక్షిణంగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. అటు పిమ్మట నవధాన్యాలతో బీజావాహం చేసి అంకురార్పణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో పాలకమండలి అధ్యక్ష సభ్యులు, తి.తి.దే ఉన్నతాధికారులు పాల్గొంటారు.  

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.