ANKURARPANAM PERFORMED FOR DEVUNI KADAPA SRI LAKSHMI VENKATESWARA SWAMY PAVITHROTSAVAMS _ శాస్త్రోక్తంగా దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల‌కు అంకురార్ప‌ణ‌

Tirupati/Devuni Kadapa, September 23, 2026: Ankurarpanam for the Pavithrotsavams of Sri Lakshmi Venkateswara Swamy Temple, Devuni Kadapa, was performed as per Agama traditions on Wednesday evening.

The three-day festivities will be held from September 24 to 26. Pavithra Pratishta, Pavithra Samarpana and Maha Purnahuti will be performed on the respective days, followed by the procession of the Lord and Goddess on September 26 evening.

Temple Inspector Sri Eshwar Reddy and others participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శాస్త్రోక్తంగా దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల‌కు అంకురార్ప‌ణ‌

తిరుపతి / దేవుని కడప, 2026 సెప్టెంబ‌రు 23: వైఎస్‌ఆర్‌ జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ  వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌వాల‌కు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ఫ‌ణ నిర్వ‌హించారు. ఇందుకోసం సాయంత్రం 6 గంట‌ల‌కు విష్వక్సేనపూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, మృత్సంగ్రాహ‌ణం, అంకురార్పణ జ‌రిగింది.

సెప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చ‌తుష్ఠార్చ‌న‌, యాగశాలపూజ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు నిత్య హోమం నిర్వహిస్తారు. 

సెప్టెంబరు 25వ తేదీ ఉదయం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 6 గంటలకు పవిత్ర హోమం నిర్వహించనున్నారు.

సెప్టెంబరు 26న ఉదయం 6 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ త‌దిత‌ర కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఆల‌యంలో స్వామి, అమ్మవార్లను ఊరేగించ‌నున్నారు.

 ఈ కార్య‌క్ర‌మంలో టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ ఈశ్వ‌ర్ రెడ్డి పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.