ANKURARPANAM PERFORMED FOR SRI PAT BTUs _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Tiruchanoor, 10 Nov. 20: As a festival of prelude to annual Karthika Brahmotsavams of Sri Padmavathi Devi at Tiruchanoor, Ankurarpanam fete was performed on Tuesday evening.

Before the seed sowing fete was carried out, Senadhipathi Utsavam was performed. The entire ritual was carried out as per the tenets of Pancharatra Agama between 6:30am and 8:30am in the temple.

Meanwhile in view of Covid guidelines,  the entire fete is carried out in Ekantam.

On November 11, the mega religious fete will commence with Dhwajarohanam in the auspicious Dhanur Lagnam between 9:30am and 9:47am.

TTD EO Dr KS Jawahar Reddy, JEO Sri Basanth Kumar, Temple DyEO Smt Jhansi Rani and others took part.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
 
తిరుపతి, 2020 నవంబరు 10: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 11 నుండి 19వ తేదీ వరకు ఏకాంతంగా జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. 
 
సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల న‌డుమ పుణ్యా‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంపతులు, జెఈఓ శ్రీ పి.బసంత్ కుమార్ దంపతులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబమ్రణ్యం, అర్చకులు, ఇతర అధికారులు  పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.