ANNABHISHEKAM ON NOVEMBER 12 _ నవంబరు 12న శ్రీకపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం
Tirupati, 6 Nov. 19: Following the auspicious occasion on November 12, Annabhishekam will be performed in Sri Kapileswara Swamy temple in Tirupati.
This religious event takes place between 12noon and 2.30 pm on that day. Later in the evening, devotees will be allowed for darshan between 4 pm and 6 pm.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నవంబరు 12న శ్రీకపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం
తిరుపతి, 2019, నవంబరు 06: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 12వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, మధ్యాహ్నం 12 నుంచి 2.30 గంటల వరకు అన్నాభిషేకం, అలంకారం ఏకాంతంగా నిర్వహిస్తారు. అనంతరం సహస్రనామార్చన, దీపారాధన చేపడతారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం రాత్రి 7.30 నుండి 8 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం నిర్వహిస్తారు.
ఈ ఉత్సవం కారణంగా తెల్లవారుజామున 5.15 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.