ANNABHISHEKAM PERFORMED IN SRI KT_ శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా అన్నాభిషేకం
Tirupati, 24 October 2018: The Annabhisheka Mahotsavam in Sri Kapileswara Swamy temple was performed on Wednesday.
After Suddhodaka Abhishekam, the presiding deity of Sri Kapileswara Swamy was covered with heaps of cooked rice in Linga Akara. The devotees had darshan of Anna Lingam between 4pm and 6pm.
Later Anna linga Udvasana(removal of cooked rice over Lingam) was observed at 6.30pm.
Tirupati JEO Sri Pola Bhaskar, Temple Deputy EO Sri Subramanyam and other officials took part in this fete.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా అన్నాభిషేకం
అక్టోబరు 24, తిరుపతి 2018: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం అన్నాభిషేకం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంలో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామివారి మహాలింగానికి (మూలమూర్తికి) ఏకాంతంగా అన్నాభిషేకం చేశారు. అంతకుముందు శుద్దోదకంతో శ్రీ కపిలేశ్వరస్వామివారికి అభిషేకం జరిగింది.
అనంతరం సుమారు 425 కిలోల బియ్యంతో వండిన అన్నంతో శ్రీ కపిలేశ్వర లింగానికి అభిషేకం చేశారు. భూమితలం నుండి పానపట్టం మరియు లింగాన్ని కూడా పూర్తిగా అన్నంతో కప్పిన తర్వాత దానిపైన ప్రత్యేకంగా అన్నంతోనే ఒక చిన్న శివలింగాన్ని తీర్చిదిద్దారు.
సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు భక్తులకు అన్నాభిషేక సర్వదర్శనం కల్పించారు. సర్వదర్శనానంతరం సాయంత్రం 6 గంటలకు అన్నలింగానికి ఉద్వాసన చేసి, స్వామివారికి సుగంధద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యం సమర్పించారు. అన్నాభిషేకంలో వినియోగించిన అన్నాన్ని సాంబారులో కలిపి భక్తులకు పంపిణీ చేశారు.
సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ అన్నాభిషేక మహోత్సవంలో భక్తులు పాల్గొని అన్న లింగ దర్శనం చేసుకున్నట్లయితే సమస్త గ్రహదోషాలు, పూర్వజన్మ సంచిత పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని, పశుపక్ష్యాది సకల జీవరాశులు సుభిక్షంగా ఉండడానికి ఈ అన్నాభిషేకం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్, డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, విజిఓ శ్రీ అశోక్‌కుమార్ గౌడ్, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.