ANNADANAM HAS HIGHEST VIRTUE AMONG ALL CHARITIES-EO _ అన్ని దానాల క‌న్నా అన్న‌దానం మిన్న : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tirumala, 7 December 2019:Among all the forms of charity, Annadanam is considered as an act of highest virtue, said TTD EO Sri Anil Kumar Singhal. 

The EO took part in the Ayudha Puja performed at Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex(MTVAC) at Tirumala on Saturday along with Additional EO Sri AV Dharma Reddy. 

Later, speaking to media persons, describing “Annadanam as Mahadanam”, the EO said, the Annaprasadam wing of TTD has been offering incredible service to pilgrims from the past several decades. “Everyday donations are pouring in to the Sri Venkateswara Annaprasadam Trust and at present we have Rs.1350crores in the Corpus. During last year, donations to the tune of Rs.141crores were given to APT out of which Rs.79crores accumulated as interest income. The total expenditure on Annaprasadam during last year is Rs.99.90crores. That means, in another two or three years, the Annaprasadam Wing will become self reliant as we can spend from the interest amount itself”, he observed.

Adding further, the EO said, at present during normal days, Annaprasadam is being served to one lakh pilgrims and during peak and occasion days over 1.5lakh pilgrims were served with Annaprasadam. Every day we are receiving 6-7 tonnes of vegetables and with the special initiative taken by Additional EO Sri AV Dharma Reddy, now in the last two months even the Annaprasadam received about 55 tonnes rice as donation”, he added.

I congratulate the entire staffs, Srivari Seva volunteers who are doing impeccable services to the multitude of pilgrims especially in the distribution of Annaprasadam during most important occasions like Garuda Seva, Ratha Sapthami, Summer vacation and Vaikuntha Ekadasi, the EO said.

Deputy EO Sri Nagaraju, Catering Officer Sri GLN Shastry, EE Sri Jagadishwar Reddy, VGO Sri Manohar and other Annaprasadam staffs, Srivari Seva Volunteers were also present.

FORMER MINISTER OFFERS A DAY DONATION IN MTVAC

Former Minister Dr DL Ravindra Reddy offered a day donation i.e.Rs.30lakhs to SVAT to serve breakfast, meals and dinner to pilgrims in Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex (MTVAC) Tirumala on Saturday.

The senior politician has also served Annaprasadam to devotees in the massive MTVAC.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

 

అన్ని దానాల క‌న్నా అన్న‌దానం మిన్న :టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుమల, 07 డిసెంబ‌రు 2019 ;అన్ని దానాల క‌న్నా అన్న‌దానం చేయ‌డం ఎంతో ఉత్త‌మ‌మైన‌ద‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ అన్నారు. తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్నప్ర‌సాద భ‌వ‌నంలో శ‌నివారం జ‌రిగిన ఆయుధ పూజలో అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ఈవో పాల్గొన్నారు.

 ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ అన్న‌దానం మ‌హాదాన‌మ‌ని, టిటిడి అన్న‌ప్ర‌సాద విభాగం కొన్ని ద‌శాబ్దాలుగా భ‌క్తుల‌కు విశిష్ట‌మైన సేవ‌లు అందిస్తోంద‌ని కొనియాడారు. ప్ర‌తిరోజూ ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు విరాళాలు వ‌స్తున్నాయ‌ని, ప్ర‌స్తుతం రూ.1,350 కోట్ల మొత్తం ఉంద‌ని వెల్ల‌డించారు. గ‌త ఏడాది రూ.141 కోట్ల విరాళాలు వ‌చ్చాయ‌ని, వ‌డ్డీ రూపంలో రూ.79 కోట్లు అందింద‌ని తెలిపారు. గ‌త ఏడాది అన్న‌ప్ర‌సాదాల విత‌ర‌ణ‌కు అయిన ఖ‌ర్చు రూ.99.90 కోట్లు అని తెలియ‌జేశారు. రానున్న రెండు, మూడు సంవ‌త్స‌రాల్లో అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టు స్వ‌యం ప్ర‌తిప‌త్తి సాధిస్తుంద‌న్నారు.

ప్రస్తుతం సాధారణ రోజుల్లో దాదాపు ల‌క్ష మంది, రద్దీ రోజుల్లో ల‌క్షా 50 వేల మంది వ‌రకు భ‌క్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారని ఈవో తెలిపారు. అన్నప్రసాదాల త‌యారీకి రోజుకు 6 నుండి 7 టన్నుల కూరగాయలను వినియోగిస్తున్నామ‌ని, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ప్ర‌త్యేక చొర‌వ‌తో గ‌త రెండు నెల‌ల్లో 55 ట‌న్నుల బియ్యం విరాళంగా అందింద‌ని వివ‌రించారు. గ‌రుడ‌సేవ‌, ర‌థ‌స‌ప్త‌మి, వైకుంఠ ఏకాద‌శి లాంటి విశేషమైన రోజుల్లో పెద్ద సంఖ్య‌లో విచ్చేస్తున్న భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదం సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు విశేషంగా సేవ‌లందిస్తున్నార‌ని అభినందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో శ్రీ నాగ‌రాజు, క్యాట‌రింగ్ అధికారి శ్రీ జిఎల్ఎన్‌.శాస్త్రి, ఇఇ శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, అన్న‌ప్ర‌సాదం సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.