ANNAKOOTOTSAVAM HELD IN SVV _ శ్రీవారి ‘నేత్ర దర్శనం – తిరుప్పావడసేవ’తో పులకించిన నెల్లూరువాసులు

DEVOTEES IMMERSE IN DEVOTIONAL WAVES

 

NELLORE, 18 AUGUST 2022: As part of ongoing Sri Venkateswara Vaibhavotsavams in Sri Potti Sriramulu Nellore district, the unique Tiruppavada Seva otherwise known as “Annakoototsavam” was held at AC Subba Reddy Stadium on Thursday morning.

 

In Tirumala, it is a practice that on every Thursday, after the morning pooja, the Mula Virat is divested of all ornaments, flowers etc. The deity will be draped only in Dhoti and Uttareeyam. The Thirunamam Kaappu and Kasturi on the forehead of the main deity are also reduced in size. This results in the unique posture of Srivaru where one can witness the peculiar Netra Darshan (where the divine eyes of the Swamy can be seen) of the main deity. The same was replicated at Nellore SVV on Thursday much to the fascination of the local devotees.

 

This ritual was held between 8.30am and 9.30am where in heaps of tamarind rice was poured in front of the presiding deity of Srivaru in a large rectangular tub amid recitation Srinivasa Gadyam the Mantras. Yet another unique feature of this ritual was, the previous wide Naamam was peeled off and a thin Naamam was adorned on the forehead of Mula Virat just to cover the space between His eyebrows. When this happens, it is believed that the first gaze of Srivaru after opening His Eyes (because they were covered by the Naamam earlier) should not fall on mortals, because it has huge power that could not be withstand by humans. Instead, it is made to fall on the mound of “Pulihora” which acts as a veil present in front of Him, thereby sanctifying it and reducing the intensity of His Gaze. Earlier, the day started with the awakening Seva of Srivaru, Suprabhatam that was rendered at 6am followed by Thomala, Koluvu, Archana and Sattumora.

 

Rajya Sabha MP Sri Prabhakar Reddy, AP Minister for Agriculture, Sri Kakani Govardhan Reddy, TTD Ex-officio Board member Sri Bhaskar Reddy, New Delhi LAC Smt Prasanthi Reddy, District Collector Sri Chakradhar Babu, MLC Sri Kotamreddi Sridhar Reddy have participated.Among TTD officials, Potu Peishkar Sri Parathasaradhi, Annamacharya Project Director Dr Vibhishana Sharma, Parupattedar Sri Tulasi Prasad, DPP Program Officer Smt Vijayalakshmi, the religious staff including Sri Venugopala Deekshitulu, Sri Mohana Rangacharyulu were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ‘నేత్ర దర్శనం – తిరుప్పావడసేవ’తో పులకించిన నెల్లూరువాసులు

నెల్లూరు, 2022, ఆగస్టు 18: నెల్లూరులో టిటిడి తలపెట్టిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం తిరుప్పావడసేవ, స్వామివారి నేత్రదర్శనంతో భక్తులు తన్మయంతో పరవశించిపోయారు.

నెల్లూరులోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ ఉత్సవాలు జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, ఉదయం 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర నిర్వహించారు. అనంతరం ప్రత్యేక సేవగా తిరుప్పావడ సేవను శాస్త్రోక్తంగా చేపట్టారు.

నేత్రదర్శనం  విశిష్టత :  

ప్రతి గురువారం ఉదయం సుప్రభాతం, తోమాలసేవ, కొలువు, మొదటి సహస్రనామార్చన, నైవేద్యం తరువాత మూలమూర్తికి అలంకరించిన ఆభరణాలు, నగలను అర్చకులు తొలగిస్తారు. స్వామివారి నొసటిపై పెద్దగా ఉన్న పచ్చ కర్పూరపు నామాన్ని బాగా తగ్గించడంతో శ్రీవారి నేత్రాలు స్పష్టంగా భక్తులకు దర్శనమవుతాయి. అందువల్లే దీనిని నేత్ర దర్శనం అంటారు.

తిరుప్పావడ సేవ  – ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు :

ప్రతి గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి అర్చనానంతరం జరిగే నివేదననే తిరుప్పావడసేవ అని, అన్నకూటోత్సవమని అంటారు. ఈ ఘట్టాన్ని నెల్లూరులోని శ్రీవారి నమూనా ఆలయంలో అర్చకులు భక్తుల ఎదుట ఆవిష్కరించారు.

శ్రీస్వామివారికి ఎదురుగా పెద్దపీఠంపై పులిహోర రాశిని ఏర్పాటుచేశారు. పులిహోరతోపాటు టెంకాయ, ఇతర పూజాసామగ్రితో అలంకరించారు. వీటిని నేరుగా గర్భాలయంలోని స్వామివారికి నివేదించారు. ఆ తరువాత భక్తుల చేత సంకల్పం చెప్పించారు. వేదపండితులు వేద పారాయణంతోపాటు శ్రీనివాస గద్యాన్ని పఠించారు.

అంతకుముందు శ్రీవారి మూలవిరాట్‌ నొసటన వెడల్పుగా గల నామాన్ని తగ్గించి సన్నగా చేశారు. ఈ మొత్తం కైంకర్యమంతా తెరల వెనకనే చేస్తారు. ”శ్రీవారు నేత్రాలు తెరిచిన తర్వాత తొలి చూపులు ఎంతో తీవ్రంగా ఉంటాయి. వీటిని మానవమాత్రులు ఏమాత్రం తట్టుకోలేరు. ఈ కారణంగానే స్వామివారి తీక్షణమైన చూపులు పులిహోర రాశిపై పడేలా చూస్తారు. దీనివల్ల ఆ ఆహారపదార్థాలు పవిత్రత పొందుతాయి. 

దేశ ప్రజలందరూ పాడిపంటలతో సుఖంగా ఉండాలని, ఆహారానికి ఎటువంటి ఇబ్బందీ రాకూడదని, సర్వసౌభాగ్యాలు కలగాలని, పాడిపంటలు అభివృద్ధి పొందాలని, ఎటువంటి ఈతి బాధలు కలుగ కూడదని సంకల్పాన్ని చెప్పి తిరుప్పావడ సేవను ఆచరిస్తారు.

అనంతరం 9.30 నుంచి 10 గంటల వరకు రెండో నివేదన, ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల భక్తులకు సర్వదర్శనం ఉంటుంది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, న్యూఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ మోహనరంగాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డా. ఆకెళ్ల విభీషణశర్మ, ఎవిఎస్వో శ్రీ నారాయణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.