ANNAMACHARYA SANKEETAN CDs RELEASED _ అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా అన్నమయ్య సంకీర్తనల ఆవిష్కరణ

Tirupati,04 June 2018 : On the occasion of Sharavana nakshatram, birth star of Lord Venkateswara, two audio CD’s of Annamcharya sankeertans were released.

Sri Muniratnam Reddy the OSD of the SV Recording Project unveiled the two CDs at the Annamaiah Kalamandir, this evening.

The CDs-Annamaiah SankeertanSumaharam and Annamaiah PadaSudha were sung by asthana singers of TTD Sri Garimella Balakrishna Prasad and Smt Bullemma, Sri anil kumar,Smt Ramanavani.

The CDs have been uploaded on the TTD website and the devotees could download them freely without cost.
Among others, Sri K J Krishnamurthy, OSD of Tarigonda Vengamamba Project and other officials, and devotees participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI


అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా అన్నమయ్య సంకీర్తనల ఆవిష్కరణ

జూన్ 04, తిరుపతి, 2018 ;శ్రీవారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం రెండు అన్నమయ్య సంకీర్తనల సిడిలను టిటిడి ఎస్‌.వి.రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు.

”అన్నమయ్య సంకీర్తన సుమహారం”, ”అన్నమయ్య పదసుధ” సిడిల్లోని కీర్తనలను టిటిడి ఆస్థానగాయకులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మరియు శ్రీమతి బుల్లెమ్మ, శ్రీ అనిల్ కుమార్, శ్రీమతి రమణవాణి గానం చేశారు. అనంతరం ఈ సిడిల్లోని కీర్తనలను కళాకారులు అద్భుతంగా ఆలపించారు.

ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యాన్ని టిటిడి కల్పించింది.

ఈ కార్యక్రమంలో తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టిటిడి. ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.