ANNAMAIAH CDs LAUNCHED_ అన్నమయ్య సంకీర్తనల సిడిలు ఆవిష్కరణ
Tirupati, 21 Jun. 19: The launching of audio CDs of saint poet Sri Annamacharya took place at Annamacharya Kalamandiram on Friday evening.
The series of CDs include, 1. ANNAMAYYA SANKEERTANA SUSHAMA 2. ANNAMAYYA PADA SUDHARNAVAM and 3. ANNAMAYYA PADA SURABHILAM rendered by renowned singer Sri G.Bala Krishna Prasad.
The CD was released on the occasion of Sravana Nakshatram Day.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అన్నమయ్య సంకీర్తనల సిడిలు ఆవిష్కరణ
తిరుపతి, 2019 జూన్ 21: శ్రీవారు జన్మించిన శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మూడు అన్నమయ్య సంకీర్తనల సిడిలను ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు.
టిటిడి ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ సంకీర్తనలను రికార్డు చేశారు. ఇందులో అన్నమయ్య సంకీర్తన సుశామ, అన్నమయ్య పద సుధార్ణవం, అన్నమయ్య పద సురభిలం అనే సిడిలున్నాయి. వీటిలోని సంకీర్తనలను టిటిడి ఆస్థాన గాయకులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ స్వరపరిచారు. శ్రీ బాలకృష్ణప్రసాద్‌తోపాటు శ్రీమతి ఆర్.బుల్లెమ్మ, శ్రీ జివిఎన్.అనిల కుమార్ ఆలపించారు.
ఈ సందర్భంగా గాయకులను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం వారు ఈ సంకీర్తనలను పాడి వినిపించారు.
ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.