ANNAMAIAH JAYANTI FETE ENTERS THE SIXTH DAY _ ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం
TIRUPATI, 29 MAY 2024: The 616th Birth Anniversary fete of Sri Tallpaka Annamacharya entered its sixth day on Wednesday at Annamacharya Kalamandiram in Tirupati.
As a part of this, Sri Kodanda Rama Swamy asthanam was performed in a jubilant manner as per tradition. During this time, the project artists rendered Sankeertans and later the deities returned to the temple.
Annamacharya Project Director Dr Vibhishana Sharma, Temple inspector Sri Suresh, devotees were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం
తిరుపతి, 2024 మే 29: అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో భాగంగా అన్నమాచార్య కళామందిరంలో బుధవారం ఉదయం 8 నుండి 9 గంటల వరకు శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం ఘనంగా జరిగింది.
ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీ కోదండరామస్వామివారి ఆలయం నుండి అన్నమాచార్య కళామందిరానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు సంకీర్తన గానం నిర్వహించారు. అనంతరం తిరిగి స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీ కోదండరామాలయానికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఉదయం 9 నుండి 10 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు శ్రీ మధుసూదన్, శ్రీమతి సుశీల బృందం ” రామచంద్రుడితడు రఘువీరుడు…, జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం…, జయ జయ రామ…., రాముడు రాఘవుడు రవికులు డితడు.., తదితర సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డా. విభీషణ శర్మ, శ్రీ కోదండరామస్వామి ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.