ANNAMAIAH SANKEERTANS ARE SRIVARI AKSHARA PRASADAM- SRI GANDHAM BASAVASHANKAR RAO _ శ్రీ‌వారి అక్ష‌ర‌ప్ర‌సాదం అన్నమయ్య కీర్తనలు : శ్రీ గంధం బ‌స‌వ‌శంక‌ర‌రావు

Tirupati, 21 May 2022:  Sri Tallapaka Annamacharya Sankeertans are Srivari Akshara Prasadam, said Telugu writer and Orator Sri Gandham Basava Shankar Rao.

Addressing the literary convention organised by TTD at Annamacharya Kala Mandiram as part of the 614th Jayanti celebrations of saint poet on the theme of  ‘Annamaiah Sankeertans’ said on Saturday evening that the TTD had published all Sankeertans found in the copper plate inscriptions into 29 volumes including 289 sankeertans researched by Sri Tallapaka Seshacharya.

He said the Sankeertans had seen light of day due to efforts of Sri Venturi Ananda Murthy, Sri Shankar Rao and given voice by TTD Asthana Vidwan Dr Garimella Balakrishna Prasad.

Earlier artists of Annamacharya Project etc. presented cultural and Bhakti programs including Harikatha, Sankeertans and Bharata Natyam programs at Mahati auditorium and Kala Mandiram.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి అక్ష‌ర‌ప్ర‌సాదం అన్నమయ్య కీర్తనలు : శ్రీ గంధం బ‌స‌వ‌శంక‌ర‌రావు

తిరుపతి, 2022 మే 21: శ్రీ తాళ్ల‌పాక అన్న‌మాచార్యుల వారు సంకీర్త‌న‌లు ర‌చించి శ్రీ‌వారి అక్ష‌ర‌ప్ర‌సాదంగా భ‌క్త‌లోకానికి అందించార‌ని హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ గంధం బ‌స‌వ‌శంక‌ర‌రావు పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 614వ జ‌యంతి ఉత్సవాల్లో భాగంగా శ‌నివారం తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు జ‌రిగింది.

ఈ సందర్భంగా శ్రీ బ‌స‌వ‌శంక‌ర‌రావు ”అన్నమయ్య సంకీర్త‌న‌లు – తితిదే ప్ర‌త్యేక సంపుటం ప‌రిశీల‌న‌ ” అనే అంశంపై ఉపన్యస్తూ రాగిరేకుల్లో ల‌భించిన సంకీర్త‌న‌ల‌ను 29 సంపుటాలుగా టిటిడి ప్ర‌చురించింద‌న్నారు. తంజావూరు త‌దిత‌ర ప్రాంతాల్లో ల‌భించిన‌వి, తాళ్ల‌పాక వంశీయులైన శ్రీ తాళ్ల‌పాక శేషాచార్యుల రాత‌ప్ర‌తుల‌ను ప‌రిశోధించి రాగిరేకుల్లో లేని 289 సంకీర్త‌న‌ల‌తో టిటిడి ప్ర‌త్యేక సంపుటం ప్ర‌చురించింద‌న్నారు. ఈ సంకీర్త‌న‌లు ప్ర‌పంచానికి వెలుగులోకి రావ‌డానికి శ్రీ వేటూరి ఆనంద‌మూర్తి, శ్రీ శంక‌ర‌రావు విశేష ప‌రిశోధ‌న చేశార‌ని చెప్పారు. ఈ సంకీర్త‌న‌ల్లో ప‌లు చారిత్ర‌క అంశాలు ఉన్నాయ‌ని, ఇవి ప‌రిశోధ‌న‌కు అనువుగా ఉంటాయ‌ని తెలిపారు. టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్ ఈ ప్ర‌త్యేక సంపుటంలోని ప‌లు సంకీర్త‌న‌ల‌ను స్వ‌ర‌ప‌రిచార‌ని వివ‌రించారు.

అంత‌కుముందు ఉద‌యం 10.30 గంటలకు చిత్తూరుకు చెందిన శ్రీమ‌తి ఇ.జ్యోత్స్న బృందం హ‌రిక‌థ వినిపించారు. రాత్రి 7 గంటలకు తిరుప‌తికి చెందిన శ్రీ ఎం.నారాయ‌ణ‌స్వామి, శ్రీ‌మ‌తి ఆర్‌.భానుప్రియ‌ బృందం గాత్ర సంగీత స‌భ‌ నిర్వ‌హిస్తారు.

మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో…

తిరుపతి మహతి కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు అన్న‌మాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీ‌మ‌తి ఆర్‌.బుల్లెమ్మ బృందం అన్న‌మ‌య్య సంకీర్త‌న లహ‌రి గాత్రం, రాత్రి 7.30 గంట‌లకు తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి టి.హేమ‌మాలిని బృందం భ‌ర‌త‌నాట్యం నృత్య కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.