Annamaiah Sankeertans in simple Sanskrit and Telugu – Sri Srinivasulu_ స‌ర‌ళ‌మైన సంస్కృతంలో తెలుగు వారికి అర్థమ‌య్యేలా అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు : శ్రీ శ్రీ‌నివాసులు

Tirupati,19 May 2022: Saint Poet Sri Tallapaka Annamacharyas couplets were written in simple Sanskrit and easily understood by all Telugus said renowned writer from Nellore, Sri Srinivasulu.

Speaking at the literary conference got up as part of 614th Jayanti of Sri Annamacharya at the Annamacharya Kala Mandiram on Thursday evening Sri Srinivasulu said in the world of devotional literature and music Sri Annamaiah sankeertans had a special place.

Earlier Harikatha Parayanam was performed by Smt Purna and her team rendered vocal.

At Mahati auditorium

The Jayanti celebrations at Mahati auditorium enthralled music lovers of Tirupati with sankeertans by Annamacharya Project artists led by Sri Raghunath and thereafter a Bharatnatyam dance program presented by Sri Balaji team.

Annamacharya Project Director Dr Vibhishana Sharma and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

స‌ర‌ళ‌మైన సంస్కృతంలో తెలుగు వారికి అర్థమ‌య్యేలా అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు : శ్రీ శ్రీ‌నివాసులు

తిరుపతి, 2022 మే 19: శ్రీ తాళ్ల‌పాక అన్న‌మ‌య్య వ‌ర్ణ‌నా వైచిత్రి నిరుప‌మాన‌మ‌ని, స‌ర‌ళ‌మైన సంస్కృతంలో తెలుగు వారికి అర్థమ‌య్యేలా అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు ర‌చించిన‌ట్లు నెల్లూరుకు చెందిన ప్రముఖ సాహిత్యవేత్త శ్రీ శ్రీ‌నివాసులు పేర్కొన్నారు. అన్నమ‌య్య 614వ జ‌యంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు గురువారం సాయంత్రం జరిగింది.

శ్రీ శ్రీ‌నివాసులు ‘అన్న‌మ‌య్య – సంస్కృత సంకీర్త‌న‌లు ‘ అనే అంశంపై ఉపన్యసిస్తూ అన్న‌మ‌య్య అలతి అల‌తి ప‌దాల‌తో దాదాపు 80 సంకీర్త‌న‌ల‌ను సంస్కృతంలో ర‌చించిన‌ట్టు తెలిపారు. సంస్కృత క‌వుల‌కు తెలుగు భాష రాక‌పోయినా ప‌ర‌వాలేద‌ని, తెలుగు క‌వుల‌కు మాత్రం త‌ప్ప‌కుండా సంస్కృతం తెలిసి ఉండాల‌న్నారు. అన్న‌మ‌య్య ప‌ద ప్ర‌యోగ నిపుణ‌త అనిత‌ర సాధ్య‌మ‌న్నారు. శ‌రణాగతి, లోకనీతి, వేదాల్లోని సారాన్ని కలిపి అన్నమయ్య తన సాహిత్యాన్ని సృష్టించారని చెప్పారు. యావత్‌ భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. అన్ని మంత్రాల సారం శ్రీ వేంకటేశ్వర మంత్రంలో ఉందంటూ స్వామివారిపై ఎనలేని భక్తిని చాటారని ఆయన వివ‌రించారు.

అంత‌కుముందు ఉద‌యం 10.30 గంటలకు తిరుప‌తికి చెందిన శ్రీమ‌తి పూర్ణ‌ బృందం హ‌రిక‌థ పారాయ‌ణం నిర్వ‌హించారు. రాత్రి 7 గంటలకు తిరుప‌తికి చెందిన శ్రీ మునిర‌త్నం రెడ్డి, శ్రీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం బృందం గాత్ర సంగీత స‌భ‌ నిర్వ‌హిస్తారు.

మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో…

తిరుపతి మహతి కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ ర‌ఘునాథ్ బృందం అన్న‌మ‌య్య సంకీర్త‌న లహ‌రి గాత్రం, రాత్రి 7.30 గంట‌లకు తిరుప‌తికి చెందిన శ్రీ బాలాజీ బృందం భ‌ర‌త నాట్యం నృత్య కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.

ఈ కార్యక్రమంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ విభీషణ శర్మ, ఇతర అధికారులు, పుర ప్రజలు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.