ANNAMAIAH WAS A GREAT PHILOSOPHER: DR SAMUDRALA LAKSHMANAIAH_ అన్నమయ్య కీర్తనలు అజరామరం : డా|| సముద్రాల లక్ష్మణయ్య

Tirupati, 15 March 2018: Describing Saint Poet Sri Tallapaka Annamacharya a great philosopher, Dr Samudrala Lakshmanaiah said, the poet has penned thousands of keertans on “Tatva Chintana”.

Speaking on the occasion of 515 Death Anniversary at Annamacharya Kalamandiram in Tirupati on Thursday, the Puranetihasa Project Officer said Annamacharya quoted the instances of Ramayana, Mahabharata, Vedas etc. in his sankeertans.

Annamacharya Project Director Sri Dhananjaya was also present.

Meanwhile in the evening Smt T Srinidhi team from Hyderabad will render sankeertans in Mahati auditorium.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

అన్నమయ్య కీర్తనలు అజరామరం : డా|| సముద్రాల లక్ష్మణయ్య

మార్చి 15, తిరుపతి, 2018: కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారిని కేంద్రంగా చేసుకుని అన్నమయ్య రచించిన సంకీర్తనలు సమాజంలో భక్తిభావాన్ని వ్యాప్తి చేయడంతోపాటు అజరామరంగా నిలిచిపోతాయని టిటిడి పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| సముద్రాల లక్ష్మణయ్య పేర్కొన్నారు. టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 515వ వర్ధంతి మహోత్సవాలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన డా|| సముద్రాల లక్ష్మణయ్య ”అన్నమయ్య వేదాంతతత్త్వం” అనే అంశంపై ఉపన్యంచారు. శ్రీవారి కృపవల్ల అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తనలకు వ్యాఖ్యానం రాసే అవకాశం తనకు వచ్చిందని తెలిపారు. ఈ కీర్తనల్లో వేదాలు, రామాయణ, మహాభారతాలు, ఉపనిషత్తులు, పురాణాల్లోని అంశాలను అన్నమయ్య స్పృశించారని తెలిపారు. వేదాంతధోరణితో రచించిన సంకీర్తనలు బహుళ ప్రాచుర్యం పొందాయన్నారు.

అనంతరం తిరుపతికి చెందిన ఆచార్య జి.దామోదరనాయుడు ”చినతిరుమలయ్య సంకీర్తనలు – సామాజికాంశాలు” అనే అంశంపై, మదనపల్లికి చెందిన డా|| ఎన్‌.క్షేత్రపాల్‌రెడ్డి ”అన్నమయ్య సంకీర్తనలు – చైతన్యస్వరాలు” అనే అంశంపై, తిరుపతికి చెందిన డా|| ఆముదాల మురళి ”అన్నమయ్య సంకీర్తనలు – నవవిధ భక్తిమార్గాలు” అనే అంశంపై ఉపన్యసించారు.

సాయంత్రం 6 గంటలకు విజయవాడకు చెందిన శ్రీ మోదుమూడి సుధాకర్‌ బృందం సంగీత సభ జరుగనుంది. ఆ తరువాత రాత్రి 7 గంటలకు ధర్మవరానికి చెందిన శ్రీ లలితా నాట్య కళానికేతన్‌ ఆధ్వర్యంలో నృత్య కార్యక్రమం నిర్వహిస్తారు.

మహతి కళాక్షేత్రంలో…

శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 515వ వర్ధంతి మహోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో హైదరాబాద్‌కు చెందిన కుమారి టి.శ్రీనిధి బృందం గాత్ర సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ ధనుంజయుడు, రీసెర్చి అసిస్టెంట్‌ డా|| సి.లత ఇతర అధికారులు, ఆధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.